టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా బాక్సర్ లవ్లినా బొర్గోహెన్ తన సత్తా చాటింది. తన కంటే బలమైన ప్రత్యర్థులను చిత్తు చేస్తూ క్వార్టర్స్ వరకు దూసుకొచ్చిన లవ్లినా.. కీలక మైన క్వార్టర్ ఫైనల్లోనూ దుమ్ములేపింది. చైనీస్ తైపీ బాక్సర్ అయిన చెన్ నైన్ చిన్‌పై అద్భుత విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఇండియాకు టోక్యో ఒలింపిక్స్‌లో మరో పతకం ఖరారు అయింది. సెమీస్ లో ఓడినా.. లవ్లికాకు పతకం కచ్చితంగా రానుంది. కాబట్టి ఆమె ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా బాగా ఆడి ఫైనల్ చేరి.. భారత్‌కు గోల్డ్ మెడల్ అందించాలని క్రీడా విశ్లేషకులు, ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండేసి బ్రాంజ్ మెడల్స్ లవ్లినా ఖాతాలో ఉన్నాయి.