Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా తన ‘విరాట్’ సిరీస్‌లో భాగంగా మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ‘లావా విరాట్ కర్వ్’ పేరుతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 21న అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫోన్ డిజైన్ , ఫీచర్లలో కంపెనీ ఎంతో ప్రత్యేకమైన మార్పులు చేసింది. ప్రధానంగా ఈ ఫోన్లో 3డి కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను అందించనున్నారు. అంతేకాకుండా, ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ పక్కన ఒక చిన్న మినీ డిస్ప్లేను కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా నోటిఫికేషన్లు, సమయం, బ్యాటరీ స్థితి, వాల్యూమ్ , ఇతర ముఖ్యమైన సూచికలను సులభంగా చూడవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయానికి రానుందని ఇప్పటికే స్పష్టమైంది.
పనితీరు పరంగా చూస్తే, ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌ను పొందుపరిచారు. అలాగే దీంట్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. ఈ బ్యాటరీ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు పదకొండు గంటల పాటు నిరంతరం యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ ఇవ్వగలదు. ఇక కెమెరా విభాగంలో.. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్752 సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 30 ఎఫ్‌పీఎస్ వద్ద 2కే వీడియో రికార్డింగ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఇక డిస్ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.67 అంగుళాల పరిమాణం గల ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 3డి కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ లభిస్తుంది. దీని గరిష్ట బ్రైట్నెస్ 1100 నిట్స్ వరకు ఉంటుందని, అలాగే మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుందని సమాచారం. దీనితో పాటు ఏఐ కాల్ సమ్మరీ, ఏఐ వాయిస్ ట్రాన్స్లేషన్, ఏఐ సర్కిల్ సెర్చ్ వంటి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా ఈ ఫోన్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ‘హెరిటేజ్ ఇండిగో’, ‘మక్రానా ఐవరీ’ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టనున్నారు. దీని ధర అధికారికంగా వెల్లడి కానప్పటికీ, మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం సుమారు 25 వేల రూపాయల ధరతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!