Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Drumstick Leaves Roti: ఎముకల పుష్టికి అవసరమైన కాల్షియం, కంటి సమస్యలను దూరం చేసే విటమిన్లు పుష్కలంగా లభించే అద్భుతమైన ఆహారాల కలయిక రాగిపిండి, మునగాకు. మన పెద్దల కాలం నుండి వస్తున్న ఈ సాంప్రదాయ వంటకం ఎదిగే పిల్లలకు, ఇంట్లోని పెద్దవారికి సంపూర్ణ పోషణను అందిస్తుంది. దీనిని తెలంగాణ ప్రాంతంలో రాగి మునగాకు సర్వపిండి అని, ఆంధ్ర ప్రాంతంలో రాగి మునగాకు తపాలా చెక్క అని కూడా పిలుస్తుంటారు.
లంచ్ బాక్స్ కోసం, సాయంత్రం స్నాక్‌గా లేదా రాత్రి డిన్నర్గా ఎప్పుడైనా దీనిని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. శీతాకాలంలో అయితే ఈ రొట్టెలు రెండు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. మరి ఈ పోష్టిక ఆహారాన్ని ఎలా తాయారు చేయాలో చూసేద్దామా..
Also Read
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
కావలసిన పదార్థాలు:
* రాగి పిండి: 2 కప్పులు,
* ఉల్లిపాయ తరుగు: 1 (సన్నగా తరిగినది),
* ఉప్పు: రుచికి సరిపడా,
* లేత మునగాకు: గుప్పెడు,
* వెల్లుల్లి తరుగు: 2 రెబ్బలు (సన్నగా తరిగినవి),
* పచ్చి కొబ్బరి తురుము: ¼ కప్పు,
* ఎండుమిర్చి ముక్కలు: 4,
* గోరువెచ్చని/వేడి నీళ్లు: 450 మి.లీ,
* నూనె: కాల్చడానికి తగినంత.
తయారీ విధానం:
ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో రాగిపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, రుచికి సరిపడా ఉప్పు, శుభ్రం చేసిన లేత మునగాకు, వెల్లుల్లి తరుగు, పచ్చి కొబ్బరి తురుము, ఎండుమిర్చి ముక్కలు వేయండి. ఇందులో దాదాపు 450 మి.లీ వేడినీళ్లు పోసి చెంచా లేదా విస్కర్ సహాయంతో కలపాలి. వేడినీళ్లు పోయడం వల్ల పిండిలోని పచ్చి వాసన పోయి, పిండి కాస్త మగ్గుతుంది. ఆ తర్వాత చేతితో ఆకు, ఉల్లిపాయ, వెల్లుల్లిని నలుపుతూ పిండిని గట్టిగా ముద్దలా కలపాలి. ఇలా చేయడం వల్ల మునగాకు, ఇతర పదార్థాల రుచులు పిండికి బాగా పడతాయి. ఈ పిండి ముద్దను కనీసం 30 నిమిషాల పాటు నాననివ్వాలి.
30 నిమిషాల తర్వాత ఒక కుండ లేదా మూకుడును బోర్లించి, దానిపై తడి కాటన్ గుడ్డను పరవాలి. ఇప్పుడు బత్తాయి కాయ పరిమాణంలో పిండి ముద్దను తీసుకుని క్లాత్ పై ఉంచాలి. చేతికి కొద్దిగా నూనె లేదా తడి రాసుకుంటూ పావు అంగుళం కంటే తక్కువ మందంతో సమానంగా రొట్టెలా ఒత్తుకోవాలి.
పెనం బాగా వేడెక్కిన తర్వాత, గుడ్డతో సహా రొట్టెను పెనంపై బోర్లించి వేసి నెమ్మదిగా గుడ్డను తీసేయాలి. రొట్టెను మీడియం మంటపై 2 నిమిషాల పాటు కాలనివ్వాలి. రాగి రొట్టె లోపల వరకు సరిగ్గా కాలడానికి సమయం పడుతుంది, కాబట్టి హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చాలి. రెండు నిమిషాల తర్వాత అంచుల వెంట, పైన అర టీస్పూన్ నువ్వుల నూనె లేదా పల్లీ నూనె వేయాలి. ఒక వైపు కాలిన తర్వాత తిరగేసి, రెండో వైపు కూడా మరో 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి. బాగా కాలిన వేడివేడి రాగి మునగాకు రొట్టెను ఏదైనా రోటి పచ్చడి లేదా ఉల్లిపాయ కారంతో కలిపి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!