Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం
- గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- ఆకట్టుకోలేకపోయిన హస్తం పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం చెలాయించింది. చిన్న పట్టణాలు, గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం అందుకుంది. రైతులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులు బలం పుంజుకున్నారు. రాష్ట్రంలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఆసక్తికరమైన పరిస్థితి తలెత్తింది. 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఐదింటిని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలుచుకోగా.. ఒకదానిని కాంగ్రెస్ గెలుచుకుంది. నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలో హంగ్ తీర్పు కొనసాగుతోంది.
మున్సిపాలిటీ- 252
బీజేపీ-144
కాంగ్రెస్ -92
స్వతంత్రులు – 16
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
మున్సిపల్ కౌన్సిల్-47
బీజేపీ-21
కాంగ్రెస్ -17
స్వతంత్రులు – 9
ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి అనేక కీలక అంశాలు దోహదపడ్డాయి. యువతకు ఉద్యోగాలు కల్పించడం, పేపర్ లీక్‌లను నివారించడం వల్లే భజన్ లాల్ ప్రభుత్వం విజయం సాధించిందని భావిస్తున్నారు. అయితే ప్రధాన నగరాల్లో యూజీసీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు పార్టీ పనితీరుపై ప్రభావం చూపాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పేలవమైన పనితీరును కనబరిచింది. బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్‌పై ఎక్కువగా ఆధారపడిందని, ఎన్నికలలో పూర్తిగా నిమగ్నం కాలేదని అంటున్నారు. అంతేకాకుండా అంతర్గత విభేదాలు, నీట్ పేపర్ లీక్, యువత సమస్యలపై మౌనం వహించడం వంటివన్నీ పార్టీ ఓటమికి దోహదపడ్డాయి.
రాజస్థాన్ పురపాలక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 4,000కు పైగా వార్డులను గెలుచుకుని అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరోవైపు, కాంగ్రెస్ 3,450కి పైగా వార్డులలో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు 2,400కు పైగా స్థానాలను గెలుచుకున్నారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నియోజకవర్గమైన బికనీర్‌లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధరా రాజే నియోజకవర్గమైన ఝలావర్‌లో కూడా ఆ పార్టీ ఓటమి పాలైంది.
ఇదిలా ఉండగా రాజస్థాన్‌లోని దీద్వానా-కుచమన్ జిల్లాలో జరిగిన పర్బత్సర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితం చర్చనీయాంశంగా మారింది. వివిధ వార్డులలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పి) అభ్యర్థులకు చెరొక ఓటు మాత్రమే లభించింది. ఆసక్తికరంగా బీజేపీ అభ్యర్థి కైలాష్ చంద్ర తాను పోటీ చేసిన వార్డులోనే ఒక్క ఓటు కూడా పొందలేదు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని ఆయన చారిత్రాత్మకమైనదిగా, అద్భుతమైనదిగా అభివర్ణించారు. రాజస్థాన్ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలందరికీ తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని సీఎం భజన్ లాల్ అన్నారు. పార్టీ కార్యకర్తల కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
సీఎం యోగి అభినందనలు
రాజస్థాన్ పట్టణ సంస్థల ఎన్నికలలో బీజేపీ సాధించిన అద్భుత విజయానికి కష్టపడిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు, రాజస్థాన్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియాలో రాశారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి భజన్ లాల్ నాయకత్వంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సేవ అనే విధానానికి ఈ చారిత్రాత్మక తీర్పు ప్రజల ఆమోద ముద్ర అని ఆయన రాశారు.
घणी-घणी बधाइयां राजस्थान!
राजस्थान निकाय चुनाव में भाजपा की प्रचंड जीत मोदी जी के नेतृत्व में प्रदेश सरकार के सुशासन और विकास कार्यों पर जनता की मुहर है।
इस प्रचंड विजय के लिए मुख्यमंत्री श्री @BhajanlalBjp जी, प्रदेश अध्यक्ष श्री @madanrrathore जी तथा @BJP4Rajasthan के सभी परिश्रमी कार्यकर्ताओं को हार्दिक बधाई।
कांग्रेस के कुशासन व भ्रष्टाचार से प्रदेश को मुक्त कर भाजपा सरकार हर क्षेत्र में विकास को नई गति दे रही है। प्रदेशवासियों का यह आशीर्वाद राजस्थान को विकसित बनाने के संकल्प को और मजबूत करेगा।
— Amit Shah (@AmitShah) September 14, 2026
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!