India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s Asia Cup winners List: మహిళల ఆసియా కప్‌లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ఖాతాలో వేసుకుంది.
2026 ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్.. ఈ టోర్నీలో తన నాలుగో టీ20 టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. మహిళల టీ20 ఆసియా కప్ 2012లో తొలిసారి నిర్వహించగా.. ఆ ఎడిషన్‌లోనే భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత 2016లోనూ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే 2018లో బంగ్లాదేశ్ విజేతగా నిలిచి భారత జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. 2022లో భారత్ మళ్లీ టైటిల్‌ను కైవసం చేసుకోగా.. 2024లో శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా 2026లో మరోసారి ట్రోఫీని గెలుచుకున్న భారత మహిళల జట్టు.. టీ20 ఫార్మాట్లో నాలుగోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. 2012, 2016, 2022, 2026 ఎడిషన్లలో భారత్ టైటిళ్లు సాధించినట్లయింది.
Also Read
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
టీ20 ఫార్మాట్లోనే కాకుండా వన్డే ఫార్మాట్లోనూ భారత్ అద్భుతమైన రికార్డును కలిగి ఉంది. మహిళల ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరిగిన నాలుగు ఎడిషన్లలోనూ టీమిండియానే విజేతగా నిలిచింది. 2004, 2005/06, 2006, 2008లో జరిగిన టోర్నీల్లో భారత్ వరుసగా టైటిళ్లను సొంతం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లను కలిపి చూస్తే.. మహిళల ఆసియా కప్‌లో భారత్ ఏకంగా ఎనిమిది టైటిళ్లను గెలుచుకుంది. ఈ గణాంకాలు ఆసియా మహిళల క్రికెట్లో టీమిండియా ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2026లో మరోసారి ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. భవిష్యత్ టోర్నీల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని చూస్తోంది.
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!