మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,831 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 541 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 39,258 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… red also : ఢిల్లీకి చేరిన విశాఖ ఉక్కు పోరాటం : రేపు, ఎల్లుండి నిరసనలు దీంతో.. ఇప్పటి వరకు […]
విశాఖ ఉక్కు ఉద్యమం నానాటికి తీవ్ర రూపు దాలుస్తోంది. రాష్ట్రంలో ఆందోళనలు చేసినా, కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో… ఆందోళనలను ఢిల్లీకి చేర్చారు కార్మిక సంఘాల నాయకులు. ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలుస్తూ, మద్దతు కూడగడుతున్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ బయలుదేరిన వేలాదిమంది కార్మికులు… హస్తినలోనే అమీతుమీ తేల్చుకుంటామంటున్నారు. ఎవరో ఇస్తే విశాఖ ఉక్కు రాలేదని. 32 మంది అమరవీరుల త్యాగఫలమని, 64 గ్రామాలు, 26 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన […]
మంచిర్యాల జిల్లాను కరోనా విడిచి పెట్టడం లేదు. వారం రోజుల్లోనే 650కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతీ రోజు 60 నుంచి 120 కేసులు నమోదు అవుతున్నాయి. బెల్లంపల్లి మండలం ఆకినెపల్లిలో మూడు రోజుల వ్యవధిలోనే 29 మందికి కరోనా సోకింది. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు ఆయన కుటుంబంలో నలుగురు కరోనా బారినపడ్డారు. జనం కరోనా తగ్గిపోయిందని మాస్కులు లేకుండానే రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సైతం కొవిడ్ నిబంధనలు […]
ఆషాఢ మాసం బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ్టితో నగరంలో బోనాల సందడి ముగియనుంది. గోల్కోండ కోటలో తొలివారం.. ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి. ఇక పాతబస్తీ లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాలు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకంతో పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 8 […]
నాగార్జున సాగర్ జలాశయానికి నాలుగు రోజుల నుంచి వరద పోటెత్తుతోంది. వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో ఐదు లక్షల ముప్పై వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తోంది. నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 569 అడుగులకు చేరుకుంది.పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా…ప్రస్తుతం 233 టీఎంసీల […]
మందుబాబులకు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. హైదరాబాద్ పరిధిలో ఇవాళ, రేపు మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా పలు ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు పకడ్బంధీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం, సోమవారం.. పాతబస్తీ బోనాల నేపథ్యంలో హైదరాబాద్ నగరం పరిధిలోని మద్యం దుకాణాలు, […]
కరోనా” వైరస్ తీవ్రత పెరుగుతోన్న కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, మిజోరాం, మేఘాలయా, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 46 జిల్లాల్లో “కొవిడ్” పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి…53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతం మధ్యలో ఉందని, ఈ జిల్లాల్లో నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితులు మరింత […]
దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 45,000కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 […]
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ టీఆర్‌ఎస్ పై ఫైర్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు అద్వాన్నంగా తయారు అయ్యాయని.. చిన్న వర్షానికే వాటర్ జమ అవుతుంది… అందులో పడి చనిపోతున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం ఉత్తుత్తి స్కీమ్ లు పెడుతున్నారని.. అక్కడ టీఆర్‌ఎస్ గెలిచే పరిస్థితి లేదని చురకలు అంటించారు. అయ్యా, కొడుకులు ఒకసారి బైక్ మీద తిరిగితే రోడ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని ఫైర్ అయ్యారు.. గ్రేటర్ కమిషనర్ ని అడిగితే […]
అసోం-మిజోరం మధ్య సరిహద్దు వివాదం మరింత ముదురుతోంది. ఇరు రాష్ట్రాలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇంచు భూమి వదులుకునేది లేదంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెగేసి చెబుతున్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి నిఘా పెట్టాయి. ఆరు కంపెనీలకు చెందిన సీఆర్‌పీఎఫ్ బలగాలు.. 306 జాతీయ రహదారిపై నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. సరిహద్దు ఘర్షణలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మిజోరం వెళ్లొద్దని.. తమ పౌరులకు […]