ఇండియాలో కరోనా కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. గడిచిన మూడు రోజుల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా కొత్తగా 44,230 మందికి పాజిటివ్‌గా తేలింది.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. ఒకే రోజు 555 మంది ప్రాణాలు కోల్పోయారు.
read also : హైదరాబాద్ లెమన్‌ట్రీ హోటల్లో ప్రేమజంట సూసైడ్
దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3.15 కోట్లకు చేరగా.. 4,23,217 మంది మృతిచెందారు. ఇక అటు 4,05,155 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉండగా.. మరోవైపు ఇప్పటివరకు 45,60,33,754 టీకాలు వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,07,43,972 మంది కరోనా నుంచి కోలుకున్నారు.