కడపజిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వైసిపికి చెందిన ముగ్గురు, బిజెపీకి చెందిన ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో బిజెపీకి చెందిన ముగ్గురు కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉంది. బీజేపీ కార్యకర్తలు గోపు ప్రసాద్, చిన్న నరసింహులు, పెద్ద నరసింహులు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు నరేంద్ర, ఆంజనేయులు గాయపడగా…ఈ ఘర్షణలో గ్రామ వాలంటీర్ వెంకటేష్ కూడా గాయాలయ్యాయి.
read also : హైదరాబాద్ లెమన్‌ట్రీ హోటల్లో ప్రేమజంట సూసైడ్
ఇటీవల వైసీపీ నుంచి బీజేపీలోకి అయ్యవారిపల్లిలో 100 కుటుంబాలు చేరాయి. ఈ నేపథ్యంలో వైసీపీ, బీజేపీ వర్గాల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. వాలంటీర్ వెంకటేష్…బీజేపీ నాయకుడు ప్రసాద్ మధ్య సంక్షేమ పథకం విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే వైసీపీ నేతలు బీజేపీ వర్గీయులపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘర్షణలో గోపు ప్రసాద్‌కు బలమైన గాయడం కావడంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉంది.