కరీంనగర్ సీపీ బదిలీపై రాజకీయ వర్గాల్లో చర్చ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్క ఉపఎన్నిక.. అక్కడి ఉమ్మడి జిల్లాలోని అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోందా? కలెక్టర్ నుంచి సీపీ వరకు ఆకస్మిక బదిలీల వెనక కారణాలు అవేనా? సీనియర్ ఐపీఎస్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడాన్ని ఎలా చూడాలి? ఉద్యోగ, రాజకీయవర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్!
కరీంనగర్ సీపీ బదిలీపై రాజకీయ వర్గాల్లో చర్చ!
Also Read
తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక రాజకీయపార్టీల్లో సెగలు రేపుతుంటే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ అధికారుల కుర్చీలు కదిలిస్తోంది. కలెక్టర్లు.. ఐపీఎస్‌లను ఉన్నపళంగా బదిలీ చేస్తున్నారు. కర్క్ నుంచి కలెక్టర్ వరకు.. హోంగార్డు నుంచి సీపీ వరకు ఇంకెన్నో ట్రాన్స్‌ఫర్లు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. బదిలీలకు కారణాలేవైనా.. అన్నీ హుజురాబాద్ ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతుండటం ఆసక్తి కలిగిస్తోంది.
Read Also : ‘జాతి రత్నాలు’ దర్శకుడితో రష్మిక మూవీ
డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయమడంపై చర్చ!
కరీంనగర్ కలెక్టర్ శశాంక బదిలీపై చర్చ జరుగుతున్న సమయంలోనే కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డిని ట్రాన్స్‌ఫర్ చేశారు. కరీంనగర్‌ను పోలీస్ కమిషనరేట్‌గా మార్చినప్పటి నుంచీ కమలాసన్‌రెడ్డే సీపీగా ఉన్నారు. చూస్తుండగానే ఐదేళ్లు పూర్తయింది. తనను బదిలీ చేయాలని రెండేళ్లుగా ప్రభుత్వాన్ని, డీజీపీని ఆయన కోరుతున్నారట. ఎందుకో ఆయన సీటు కదలలేదు. ఇప్పుడు సడెన్‌గా బదిలీ చేయడం ఒక ఎత్తు అయితే.. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయమడం ఆశ్చర్య పరుస్తుంది. గతంలో ఇలాంటి సందర్భాలు.. ఉదంతాలు అరుదుగా చెబుతున్నాయి ఖాకీ వర్గాలు. పోలీస్ శాఖలో కిందిస్థాయిలో ఎస్‌ఐ, సీఐలను ఎస్పీ, డీఐజీ ఆఫీస్‌లకు అటాచ్ చేస్తేనే ఏదోలా చూస్తారు. అలాంటిది ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఈ విధంగా డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయమనడం చర్చగా మారింది.
ఉపఎన్నికా? మంత్రితో వచ్చిన ఇబ్బందా?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌తో సీపీ కమలాసన్‌రెడ్డికి సాన్నిహిత్యం ఉంటుందనే అనుమానాలు ఉన్నాయట. అందుకే బదిలీ చేసినట్టు చర్చ జరుగుతోంది. అయితే ఓ మంత్రితో వచ్చిన విభేదాల వల్లే సీపీ ట్రాన్స్‌ఫర్ అయ్యారనే ప్రచారం కూడా ఉంది. కారణాలేవైనా.. చర్చ మాత్రం హుజురాబాద్ చుట్టూనే తిరుగుతోంది. కమలాసన్‌రెడ్డి ప్లేస్‌లో రామగుండం సీపీగా ఉన్న సత్యనారాయణకు పోస్టింగ్ ఇచ్చారు.
రాజకీయ వేడి రాజుకున్న సమయంలో బదిలీలు!
తెలంగాణలో చాలా కాలంగా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు IPSలు. ఇవిగో ట్రాన్స్‌ఫర్లు.. అవిగో ట్రాన్స్‌ఫర్లు అంటూ లీకులు వచ్చినప్పుడల్లా పోలీసుల ఆశలపై నీళ్లు జల్లే పరిస్థితి. సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నవారు.. పదోన్నతులు దక్కినా.. ఉన్నచోటే కాలం వెళ్లదీస్తున్నవారు ఎందరో. ఇలాంటి సమయంలో కమలాసన్‌రెడ్డిని సడెన్‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు. అదీ రాజకీయవేడి రాజుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కావడంతో మరింత చర్చకు ఆస్కారం కల్పిస్తోంది. హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించే నాటికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇంకెంతమందికి మూడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!