Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganga Aarti in London: లండన్‌లో చారిత్రాత్మక ఆధ్యాత్మిక వేడుక జరిగింది. భారతదేశంలో గంగా నది తీరంలో సంప్రదాయంగా నిర్వహించే గంగా హారతిని తొలిసారిగా బ్రిటన్‌లోని థేమ్స్ నది తీరంలో నిర్వహించారు. సెప్టెంబర్ 13 (ఆదివారం) జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరై భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను ఘనంగా జరుపుకున్నారు.
‘గంగా హారతి ఆన్ ది థేమ్స్: ఎ సెరిమనీ ఆఫ్ లైట్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చిన్మయ మిషన్ యూకే, వార్షిక టోటల్లీ థేమ్స్ ఫెస్టివల్‌తో కలిసి నిర్వహించింది. భారతీయ ప్రవాసులు, భక్తులు, స్థానికులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
భారత్‌లో గంగా నది తీరంలో పవిత్ర గంగమ్మకు ప్రార్థనలు చేస్తూ దీపాలను సమర్పించడం గంగా హారతి సంప్రదాయం. అదే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని థేమ్స్ నది ఒడ్డున నిర్వహించడం ద్వారా భారత్, బ్రిటన్ మధ్య ఉన్న సాంస్కృతిక బంధానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా.. సంప్రదాయ ప్రార్థనలు, భక్తి గీతాలు, మంత్రోచ్ఛారణలతో పాటు దీపాలను వెలిగించి నదికి హారతి ఇచ్చారు. థేమ్స్ నది తీరంలో వేలాది మంది ఒకేచోట చేరడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
చారిత్రాత్మక ఓల్డ్ రాయల్ నేవల్ కాలేజ్, గ్రీన్విచ్ నేపథ్యంగా ఈ వేడుక జరిగింది. భారతీయ సంప్రదాయాలను లండన్‌లో ప్రదర్శించడంతో పాటు.. గంగా నదితో ముడిపడిన ఆధ్యాత్మిక భావనను బ్రిటన్‌లోని భారతీయ ప్రవాసులు, ఇతర సమాజాలకు పరిచయం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
బ్రిటన్‌లోని అత్యంత ప్రసిద్ధ నదుల్లో థేమ్స్ ఒకటి. లండన్ నగర చరిత్ర, అభివృద్ధితో ఈ నదికి విడదీయరాని సంబంధం ఉంది. థేమ్స్ అనే పేరు పురాతన సెల్టిక్ పదమైన ‘టామెసాస్’ నుంచి వచ్చిందని చెబుతారు. గంగా, థేమ్స్ రెండూ తమ తమ ప్రాంతాల నాగరికత, సంస్కృతిపై గణనీయమైన ప్రభావం చూపిన నదులు. ఈ నేపథ్యంలో థేమ్స్ తీరంలో తొలిసారిగా గంగా హారతి నిర్వహించడం రెండు సంస్కృతుల మధ్య ప్రతీకాత్మక వారధిగా నిలిచింది. భారతీయ సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పే అరుదైన ఘట్టంగా ఈ కార్యక్రమం నిలిచింది.
Ganga Aarti on the Thames – London #BritishIndians #BritishHindus pic.twitter.com/Pt3z7w6OE6
— British Indians Voice 🇮🇳🇬🇧 (@BritIndianVoice) September 13, 2026
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!