అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు.. అధికారుల మధ్య అవగాహన ఉన్నంతకాలం ఎలాంటి గొడవలు రావు. తేడా కొట్టిందో.. రచ్చ రచ్చే. ఆ జిల్లాలో ప్రస్తుతం అధికారపార్టీ ఎమ్మెల్యేకు.. జిల్లా ఎస్పీకి మధ్య అదే జరుగుతోందట. తమ పని తప్ప మరో అంశం పట్టని ఇద్దరికీ ఎక్కడ చెడిందనే చర్చ మొదలైంది. ఇంతకీ వారెవరు? రగడ రాజేసిన బిచ్కుంద పోలీస్‌స్టేషన్! ఈయన కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. ఇక శ్వేతారెడ్డి ఆ జిల్లా ఎస్పీ. బిచ్కుంద పోలీస్‌స్టేషన్ […]
ఎంకిపెళ్లి సుబ్బిచావుకు రావడం అంటే ఇదే. ఏదో ఆశించి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే.. అది అధికారపార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేసిందట. ‘రాజీనామా చేయండి సార్..!’ అంటూ.. సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్‌తో శాసనసభ్యులకు తలబొప్పి కడుతోందట. అదేంటో లెట్స్ వాచ్! హుజురాబాద్‌లో దళితబంధు పైలెట్ ప్రాజెక్టు దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ స్కీమ్‌పై వివిధ వర్గాలతో సమాలోచనలు చేశారు సీఎం కేసీఆర్. పథకాన్ని పట్టాలెక్కించే పనిలో […]
అధికార పార్టీలోకి వెళ్లితే ఐదేళ్లు ఢోకా ఉండదని ఎన్నో లెక్కలు వేసుకున్నారు ఆ ఎమ్మెల్యే. కేబినెట్‌లో చోటు దక్కుతుందని గంపెడాశలతో ఉన్నారు. ఇంతలో మారిన రాజకీయ పరిణామాలతో ఆయనకు నిద్రకరువైందట. ఉన్న పార్టీలోని కేడర్ ఎమ్మెల్యేను ఓన్ చేసుకోవడం లేదట. ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్లేమో కత్తులు నూరుతున్నారు. ఇప్పుడు వాళ్లూ..వీళ్లూ కలిసిపోవడంతో కంగారెత్తిపోతున్నారట ఆ ఎమ్మెల్యే. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. గండ్ర లక్ష్యంగా భూపాలపల్లిలో రాజకీయ వేడి! శత్రువుకు శత్రువు మిత్రుడు. భూపాలపల్లిలో రాజకీయం […]
మహా నగరం హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ఉన్న నేపథ్యంలో… హైదరాబాద్ లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫలక్ నామా, ఇంజన్ బౌలి నుంచి వచ్చే వెహికల్స్ అలియాబాద్ నుంచి షంషీర్ గంజ్ గోశాల తార్బన్ మీదుగా వెళ్ళాల్సి ఉంటుందని.. అలాగే… కందికల్ గేట్ బాలరాజ్ గంజ్ మంచి లాల్ దర్వాజ రూట్ లో ట్రాఫిక్ ను అనుమతించబోమని పేర్కొన్నారు పోలీసులు. […]
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,649 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 593 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 37,291 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,13,993 కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,07,81,263 కి […]
జీఎస్టీ రేట్లను రేషనలైజ్ చేయాలంటూ చాలా రోజులుగా ప్రజలను నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వ్యాపారవర్గాలు కూడా ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరుతూనే ఉన్నాయి. అలాంటివారందరికీ కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ అజెండాలో జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐదు శ్లాబ్స్‌లో ఉన్న జీఎస్టీ రేట్లను మూడు స్లాబ్స్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీలో మూడు రేట్ల వ్యవస్థ చాలా […]
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో చిగురుటాకులా వణికిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఆస్పత్రులు, కార్యాలయాలకు నీళ్లు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.పశ్చిమబెంగాల్‌లోని బిర్‌భూమ్, బంకురా, వెస్ట్‌మిడ్నాపూర్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. బిర్‌భూమ్‌లోని ప్రముఖ కంకాలితాల ఆలయం నీట మునిగింది. బంకురా జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజస్థాన్‌లోనూ భారీ వరదలకు […]
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఈ మీటింగ్‌లోనే ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల పలు దఫాలుగా దళితబంధుపై చర్చలు జరిపిన సర్కారు…ఈ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత తొందరగా అమలులోకి తీసుకురావడం, బడ్జెట్ కేటాయింపులు చేయడం తదితర అంశాలను ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. […]
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు ఎక్కువగా.. హైదరాబాద్‌పై ఫోకస్ చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లను చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే రేపు, ఎల్లుండి హైదరాబాద్ నగరం పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, అలాగే బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు… ప్రకటించారు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ అధికారులు. బోనాలు, […]
ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి […]