వినాయక నిమజ్జనం రోజున తెలంగాణ రాష్ట్రంలో విషాదం నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లా లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే… ఈ ఘోర రోడ్డు ప్రమాదం లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… నాగర్ కర్నూల్ జిల్లా… పదర మండలంలోని మద్ది మడుగు సమీపం లో దేవర కొండ డిపో బస్సును…. ఆటో ఢీ కొట్టినట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఈ ఘోర ప్రమాదం లో ఏకంగా నలుగురు వ్యక్తులు […]
ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిజంగా కన్నెర్ర చేస్తే మీరు రోడ్డు మీద తిరగగలుగుతారా ? అచ్చెన్నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ప్రజల్లోకి వెళదాం… మీ సీట్లు మీకు మిగులుతాయో లేదో చూసుకుందామని పేర్కొన్నారు. ఓటమి తప్పదని ముందే టీడీపీ పారిపోయిందని… ఎన్నికలు బహిష్కరిస్తామని డ్రామాలు చేసిందని విమర్శించారు.రెండేళ్ల జగన్ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి చూసి […]
ఓట్ల లెక్కింపుపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది స్పందించారు. లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని… 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్ జరుగుతోందని వెల్లడించారు. పలు కారణాల తో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని… రెండుచోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు, మిగిలిన4 చోట్ల తడిచాయని తెలిపారు. తాడికొండ మం. రావెల, బేజాతపురంలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని… శ్రీకాకుళం జిల్లాలో షలాంత్రిలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయన్నారు జి.కె.ద్వివేది. విశాఖలో తూటిపల్ల, పాపయ్యపాలెంలో బ్యాలెట్లు తడిచాయని… […]
జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని… Ghmc పరిధిలో సుమారు 40 వేల విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందని తెలిపారు. వీటిలో కోన్ని 3 వ రోజు, 5 వ రోజు మరికొన్ని విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగిందని… ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శోభాయాత్ర, నిమజ్జనం జరిగేలా […]
నవ్యాంధ్ర ఏర్పడి దాదాపు ఏడేళ్లన్నరేళ్లు కావస్తోంది. విభజన హామీలో భాగంగా విశాఖకు రైల్వే జోన్ తోపాటు మైట్రో ట్రైన్ ప్రాజెక్టు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఏపీకి మెట్రో ట్రైన్ ప్రాజెక్టు మంజూరు కాకపోవడం శోచనీయంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కు మాత్రమే మెట్రో రైలు ప్రాజెక్టును అప్పటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. టీఆర్ఎస్ సర్కారు హయాంలో మెట్రో ట్రైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్లో కొంతమేర ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి. ఈ […]
త్వరలోనే హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరుగనుంది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఎన్నిక మారింది. దీంతో ఎవరికీవారు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లురుతున్నారు. ఈటల రాజేందర్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతుండగా టీఆర్ఎస్ నుంచి యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నాడు. కాంగ్రెస్ పోటీలో నిలిచినా అది రెండో, మూడో ప్లేస్ కోసమనే అర్థమవుతోంది. దీంతో పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యేనని స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కొత్తేమీకాదు. […]
ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ చీమ చిటుక్కుమన్న అగ్రరాజ్యం అమెరికాకు తెలిసిపోతుందని పేరుంది. అయితే ఇదంతా అమెరికా గత వైభవంగా కన్పిస్తుంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లే అమెరికా ఇటీవల కాలంలో చాలా వైఫల్యాలను చవిచూస్తోంది. రాజకీయ కారణాలో లేక పరిపాలన దౌర్భాగ్యమో తెలిదుగానీ ఆ దేశానికి చెందిన నిఘా సంస్థలు సైతం ఇటీవల కాలంలో మెరుగైన పనితీరును కనబర్చడం లేదు. తాజాగా అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల తప్పుడు నిర్ణయంతో 10మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి […]
సంగారెడ్డి జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. 7 సంవత్సరాల మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. సంగారెడ్డికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి జోగిపేట వైపు బైక్ పై తీసుకు వెళ్లారు కొందరు దుండగులు. శివ్వంపేట కల్లు దుకాణంలో కల్లు సేవించేందుకు బాలికను వెంట తీసుకెళ్లారు ఆగంతకులు. చిన్నారి ఏడుస్తుండడంతో అనుమానంతో గ్రామస్థులు ఆగంతకులను నిలదీశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ బాలికను నమ్మించి కిడ్నాప్ చేసినట్లు అంగీకరించారు నిందితులు. బాలికను […]
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 30,773 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,48,163 కి చేరింది. ఇందులో 3,26,71,167 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 3,32,158 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 309 మంది మృతి […]
వినాయక నిమజ్జనాల సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమలవుతాయి. ఇవాళ అర్థరాత్రి నుంచే హైదరబాద్‌లోకి జిల్లాలు, అంతర్రాష్ట లారీల ప్రవేశంపై నిషేధం విధించారు. ఆర్టీసీ బస్సులను కూడా పలు చోట్ల దారి మళ్లిస్తారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు గణేశ నిమజ్జన యాత్ర మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని కోరుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. గణేశ్ […]