తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక.. ప్రత్యక్షంగా ఇంటర్ విద్యార్థులపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణకు ఎంచుకున్న జూనియర్ కాలేజీలు.. ఇక్కడే ఉండటం సమస్యకు కారణమైంది. నియోజకవర్గంలోని జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లోనే నాలుగు పరీక్షా కేంద్రాలున్నాయి. దీంతో ఏంచేయాలో పాలుపోక జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులకు లేఖరాశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ.. హుజూరాబాద్ నియోజవర్గంలో నాలుగు ప్రభుత్వ జూనియర్ […]
తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చురకలు కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ విజయం ఖాయమని… ప్రతి ఎన్నికకు సవాల్ చేయడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. హుజురాబాద్ నియోజక వర్గంలో గెల్లు శ్రీనివాస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. నిన్న మమతా బెనర్జీ గెలిచింది- మోడీ రాజీనామా చేస్తారా? మమతా బెనర్జీ ఎన్నిక బీజేపీ ఛాలెంజ్ గా తీసుకుంది […]
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఉప ఎన్నిక హీట్ పెంచింది. వైసీపీ ఎమ్మెల్యే మృతితో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ షూరు అయ్యింది. అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ నుంచి మృతిచెందిన ఎమ్మెల్యే భార్యకే అధిష్టానం టికెట్ కేటాయించింది. టీడీపీ సైతం తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక జనసేన […]
తెలుగు అకాడమీ స్కాం కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు సీసీఎస్ పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇందులో కీలక పాత్ర పోషించిన మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. అసలు ఇందులో కీలక సూత్రధారులు ఎవరు? ఎక్కడి నుంచి ఎవరికి నిధులు మళ్లాయి?తెలుగు అకాడమీ స్కాంలో ఇంకెవరెవరున్నారు? కీలక సూత్రధారులు ఎవరు అన్నదానిపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసి వారిని ప్రశ్నిస్తున్న పోలీసులు.. నిధుల తరలింపులో […]
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 20,799 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 180 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,31,21,247 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,48,997 మంది మృతి చెందారు. దేశంలో 2,64,458 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి […]
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి చిక్కులు తప్పడంలేదు. ఓవైపు సొంత పార్టీనుంచి మరోవైపు విపక్షాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి. కొత్తగా నియమించిన డీజీపీ, అడ్వొకేట్ జనరల్ లను తొలగించాల్సిందేనని సిద్ధూ పట్టుబడుతుండగా, ఉన్నతస్థాయి సమావేశానికి సీఎం కొడుకు హాజరవడంపై విపక్షాలు విమర్శలను ఎక్కుపెడుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్‌ను ఏదో ఒకటి చేసేవరకు సిద్ధూ విశ్రమించేలా లేడు. కోరి ముఖ్యమంత్రి చేసిన చరణ్ జిత్ సింగ్ చన్నీతో అప్పుడే గొడవకు దిగాడు. డీజీపీ, అడ్వొకేట్ జనరల్ […]
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. SRH విధించిన 116 పరుగుల టార్గెట్‌ను 19.4 ఓవర్లలో మరో 6 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇక KKR బ్యాట్స్‌మెన్లలో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. నితిష్ రానా 25 , దినేశ్ కార్తీక్ 18 పరుగులు చేశాడు. SRH బౌలర్లలో హోల్డర్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్‌లకు తలో వికెట్ దక్కింది. ఇక అటు నిన్న జరిగిన […]
ఉత్తరప్రదేశ్‌లో హింస చెలరేగింది. లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండలో 8 మంది రైతులు మృతిచెందారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లడంతో… ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కాన్వాయ్ ఢీకొని నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. అల్లర్లలో మరో నలుగురు మృతి చెందడం విషాదంగా మారింది. ఉత్తరప్రదేశ్ లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య హాజరయ్యారు. వీరి […]
బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ సమయంలో కరోనా కేసులతో పాటుగా ధరలు కూడా పెరుగుతున్నాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 43, 510 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 10 పెరిగి రూ. 47, 470 కి చేరింది. […]
మేషం:- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. కుటుంబ సమేతంగా వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తుల వారికి పురోభివృద్ధి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులు తమ సమర్థతో అధికారులను మెప్పిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వృషభం:- ఓర్పు, పట్టుదలతో యత్నాలు సాగించండి. ప్రభుత్వ సంస్థలలో పనులు వాయిదా పడతాయి. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సమస్యలెదురవుతాయి. బాధ్యతలు, పనులు ఇతరులకు అప్పగించి ఇబ్బందు లెదుర్కుంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. […]