Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishna Murali: టాలీవుడ్లో రచయితగా, డైరెక్టర్‌గా, నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న పోసాని కృష్ణమురళి తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన చిన్ననాటి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన కెరీర్ స్టార్టింగ్ రోజుల్లో ఒకేసారి 18 నుంచి 22 సినిమాలకు రచయితగా పని చేశానని పోసాని తెలిపారు. “ఆ సమయంలో ఇండియాలో అంత బిజీగా ఉన్న రైటర్ మరొకరు లేరు. నాకు నటనంటే ప్రత్యేకమైన ఇష్టం లేదు. పరిస్థితుల వల్లే నటుడిగా మారాల్సి వచ్చింది” అని చెప్పారు. ఈ పాడ్‌కాస్ట్‌లో చిరంజీవి సినిమాల్లో కామెడీ ట్రాక్‌ల గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకసారి తాను చెప్పిన కామెడీ లైన్ వల్ల సినిమా హిట్ అవుతుందని భావించారని, కానీ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదని గుర్తుచేశారు. ఒక సినిమా విజయం లేదా పరాజయం ఒక్క అంశంపైనే ఆధారపడదని ఆయన అభిప్రాయపడ్డారు.
దర్శకుడిగా మారాలనే ఆలోచనతో తానే నిర్మాతగా కూడా వ్యవహరించానని, అయితే మొదట అనుకున్న కథ షూటింగ్ టైంలో చాలా మారిపోయిందని చెప్పారు. “నేను అనుకున్న కథలో 50 శాతం కూడా చివరికి తెరపైకి రాలేదు” అని వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ పోసాని భావోద్వేగానికి గురయ్యారు. “మా నాన్న కూలీ. ఆయన దగ్గర ఉన్న డబ్బు పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో మాకు సహాయం చేసిన బంధువులు ఎవరూ లేరు. తర్వాత నేను స్థిరపడిన తర్వాత చాలా మంది నాతో సహాయం పొందారు” అని చెప్పారు. సినీ పరిశ్రమలో అవకాశాలు ఎలా వచ్చాయో కూడా ఆయన వివరించారు. ఒకసారి పరుచూరి బ్రదర్స్ వారి మధ్యలో తనను కూర్చోబెట్టిన సందర్భంలో తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాననే నమ్మకం వచ్చిందని అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని పోసాని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు పంచి గెలవడం తన సిద్ధాంతం కాదని స్పష్టం చేశారు. “ప్రజల సొమ్మును నేను తినను. ప్రజల కోసం పనిచేయడమే రాజకీయాల అసలు ఉద్దేశం” అని వెల్లడించారు. పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!