IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- దక్షిణాదిలో వడగాలులు
- పలు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. ఎల్‌నినో కారణంగా దేశంలో వర్షాలు కరవయ్యాయి. ఇలాంటి తరుణంలో ఐఎండీ గుడ్‌న్యూస్ చెప్పింది. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు దక్షిణ, తీర ప్రాంత రాష్ట్రాల్లో మాత్రం రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది.
భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు తూర్పు, ఈశాన్య భారతంపై చురుకుగా కొనసాగుతున్నాయి. దీంతో వచ్చే వారం రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలకు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా ఒడిశా, జార్ఖండ్, బీహార్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
త్రిపురలో జూలై 16 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీటిమునిగే పరిస్థితులు, స్థానికంగా వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అగర్తల సహా పలు ప్రాంతాల్లో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయని తెలిపింది. జూలై 15, 16 తేదీల్లో వర్షాల తీవ్రత కొంత తగ్గినా.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఖోవాయ్, వెస్ట్ త్రిపుర, సెపాహిజాలా, గోమతి, సౌత్ త్రిపుర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అసోంలో కూడా వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూలై 15 నుంచి వర్షాలు మరింత ఉద్ధృతం కానున్నాయని, ఉరుములు, మెరుపులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు లేదా బలహీన నిర్మాణాల కింద ఆశ్రయం తీసుకోవద్దని ప్రజలకు సూచించింది.
ఇక ఉత్తరాఖండ్‌లో జూలై 15 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వారాంతానికి జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. ఉత్తరప్రదేశ్ తూర్పు జిల్లాల్లో జూలై 17 నుంచి 19 వరకు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జూలై 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
దక్షిణ భారతంలో ఉక్కపోత
మరోవైపు దక్షిణ భారత రాష్ట్రాల్లో మాత్రం వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగనుంది. తీర ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉక్కపోత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తీర ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడం, పొడి వాతావరణం కొనసాగడం, సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యవసాయ పంటలకు నష్టం జరగకుండా మూడు దశల అత్యవసర కార్యాచరణ ప్రణాళికలో తొలి దశను అమలు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మొత్తంగా తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరోవైపు దక్షిణ భారతంలో ఉక్కపోత కొనసాగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
- Tags
- IMD
- india
- weather alert
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!