YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. ‘పితృసమాన నేతను కోల్పోయాం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన జగన్, ముద్రగడ తనకు పితృసమానులని పేర్కొంటూ ఆయన మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ముద్రగడ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందన్న సమాచారం తమకు ఆశ కలిగించిందని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వస్తారని భావించిన సమయంలో ఆయన శాశ్వతంగా దూరం కావడం ఎంతో బాధాకరమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముద్రగడ పద్మనాభం దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలు అందించారని జగన్ కొనియాడారు. విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన ముద్రగడ పదవుల కంటే ప్రజల సేవకే ప్రాధాన్యం ఇచ్చారని, పేదల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ముద్రగడ పద్మనాభం నిజాయితీ, ఆత్మగౌరవం, నిబద్ధతకు ప్రతీక అని పేర్కొన్న వైఎస్ జగన్, ఆయన మరణం కుటుంబానికే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటని అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా… pic.twitter.com/HReowspJ4e
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2026
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!