మనదేశలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 18,346 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,853,048 కు చేరింది. దేశంలో 2,52,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 29, 639 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.93 శాతంగా ఉంది. అటు కేరళ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8850 కరోనా కేసులు […]
హుజురాబాద్ లో నామినేషన్ ల సందడి నెలకొంది. ఈరోజు నామినేషన్ల సమయం ముగిసే సరికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బిజెపి తరపున ఈటెల జమున పేరుతో నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 8న ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హుజురాబాద్ లో 4వ రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బిజెపి తరఫున ఈటెల రాజేందర్ సతీమణి జమున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ లో ఈటెల జమున ప్రతీసారీ సెంటిమెంట్ గా నామినేషన్ […]
గత నాలుగు వారాలుగా హౌస్ మేట్స్ ముందే నామినేషన్స్ ప్రక్రియను నిర్వహించిన బిగ్ బాస్ ఈసారి మాత్రం పవర్ రూమ్ కు కంటెస్టెంట్స్ ఒక్కొక్కరినీ పిలిచి, తాము నామినేట్ చేయాలని అనుకున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పమని కోరాడు. దాంతో అందరూ తమ మనసులోని వారిని నిర్మొహమాటంగా నామినేట్ చేసేశారు. తీరా నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎవరెవరి పేర్లను, ఎవరెవరు నామినేట్ చేశారో ఫోటోలతో సహా, హౌస్ లోని టీవీలో డిస్ ప్లే చేశాడు […]
కరోనా తగ్గిందని ప్రశాంతంగా ఉందాం అనుకునేలోపే పోస్ట్ కరోనా సమస్యలు మొదలయ్యాయి. శరీరంలోని అన్ని అవయవాలపైనా కరోనా తన ప్రభావం చూపిస్తుంది. తాజాగా నిమ్స్ వైద్యుల పరిశోధనలో జీర్ణ కోశ వ్యవస్థపై కరోనా ప్రభావం ఉందని తేలింది. చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టి అది ముదిరి గ్యాంగ్రేన్‌గా మారుతోందని నిమ్స్ వైద్య బృందం అంటోంది. దేశంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉంది. ఐతే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అంతా బాగానే ఉందని అనుకుంటే పొరపాటే. కరోనా […]
వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి వ్యతిరేకించారు. మద్దతు కోరుతూ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ముఖ్యంగా ఎన్‌డీఏయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. నీట్‌ను వ్యతిరేకించడంతో పాటు విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతను తిరిగి పొందడానికి ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని […]
ఐపీఎల్‌లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా పోరు సాగింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడ్డ ఢిల్లీ కేపిటల్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. చెన్నై టార్గెట్ పెట్టిన 137 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా టాప్ ఆర్డర్ విఫలమవడంతో… ఢిల్లీ కేపిటల్స్ కష్టాల్లో పడింది. అయితే ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్… రబాడతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాయింట్ల […]
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సామాజిక సేవకురాలు పద్మశ్రీ,రామన్ మెగాసేసే అవార్డ్ గ్రహీత ప్రో.శాంతా సిన్హా . ఈ సందర్భంగా ప్రొఫెసర్ శాంత సిన్హా మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగాలి అని ఆకాక్షించారు. మానవాళికి చెట్లు ఎంతో అవసరం వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని గుర్తుచేశారు.ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొని […]
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ రెండు రాష్ట్రంలో అమలు చేస్తున్నామని… ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి మాత్రమే లబ్ది చేకూరుతుందని… ఆరోగ్య శ్రీ ద్వారా 87 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది అందుకే ఆరోగ్య శ్రీని అమలు చేస్తున్నామని ప్రకటించారు. గత మే 18 2021 నెల నుండి ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని… మే 18 వతేది […]
బద్వేల్ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాన్ని మార్చివేయనుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఈ ఉప ఎన్నిక మాత్రం ఏపీలో ఎవరు మిత్రులు.. ఎవరు శత్రువులు అనే దానిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వనుంది. బద్వేల్ లో నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రోజురోజుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంది. ఒక పార్టీలో బరిలో ఉంటామని ప్రకటిస్తుండగా మరోపార్టీ పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెబుతోంది. దీంతో బద్వేల్ రాజకీయం ఒకింత […]
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు బయటపడుతున్నాయి. ఇంకా చాలా దేశాల్లో భయంకర స్థాయిలోనే కరోనా ఉంది. అయినప్పటికీ.. స్కూల్స్ తెరవాల్సిందే అంటోంది వరల్డ్ బ్యాంక్. చిన్నారులు ఈ వైరస్ బారినపడే అవకాశాలు తక్కువేనని తన తాజా నివేదికలో తెలిపింది. టీకాల పంపిణీ చేసేవరకూ పాఠశాలలు తెరవకుండా ఉండాల్సిన అవసరం లేదని చెబుతోంది. వ్యాక్సిన్ రూపొందించక ముందే చాలాదేశాల్లో పాఠశాలలు తెరిచినప్పటికీ.. పరిస్థితులేమీ విషమించలేదని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. వైరస్ తీవ్రతను తగ్గించే వ్యూహాలను అమలు చేయాలని, అదే […]