ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 22,842 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,30,94,529 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,70,557 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 244 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,48,817 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో […]
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్ ఉపఎన్నిక ఫలితం ఇవాళ వెలువడనుంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ జరిగే ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించారు. 24 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. ఈ ఉపఎన్నికలో దీదీ గెలిస్తేనే ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోలుగుతారు. దీంతో ఉపఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. శనివారం అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో తన ఫ్లేఆఫ్అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. యశస్వీ జైశ్వాల్, శివమ్ దూబే.. హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో.. చెన్నై నిర్దేశించిన 190 పరుల భారీ లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలుండగానే.. ఛేదించింది రాజస్థాన్. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 […]
తెలుగు అకాడమీ కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. అకాడమీ డబ్బులు కొట్టేసిన గ్యాంగ్.. ప్రైవేటు వ్యక్తుల డిపాజిట్లు కూడా నొక్కేసినట్టు తెలిసింది. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ప్రైవేట్ వ్యక్తుల డబ్బులను.. నకిలీ పత్రాలు చూపి.. ఈ ముఠా స్వాహా చేసినట్టు నిర్ధారించారు . ఏపీ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ సహకారంతో.. మస్తాన్ వలీ అండ్ గ్యాంగ్ ఈ వ్యవహారం నడిపినట్టు దర్యాప్తులో తేలింది.కోట్ల రూపాయలు అడ్డంగా దోచుకున్న స్కామ్‌లో కీలక నిందితుడైన యూబీఐ […]
మన దేశంలోనే కాదు… ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతు న్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 43, 500 కి […]
మేషం:- పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. కుటుంబీకుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితులలో ఒకరి గురించి ఆందోళన పెరుగుతుంది. ముఖ్యుల కోసం షాపింగులు చేస్తారు. స్పెక్యులేషన్ కలసిరాదు. నేడు అనుకూలించని యత్నం రేపు ఫలిస్తుంది. వృషభం:- విద్యార్థులకు ఏకాగ్రత, ఆసక్తి ఏర్పడుతుంది. ఆలస్యమైన అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయడం మంచిది. విందులలో పరిమితి పాటించండి. మీ సంతానం మొండి […]
వీడ్కోలు సభలో ఏం మాట్లాడతారు..? రిటైరయ్యే అధికారిని పొగడ్తల్లో ముంచెత్తుతారు. వచ్చే అధికారి నైపుణ్యాన్ని ప్రస్తావిస్తారు. కానీ.. ఆ వీడ్కోలు సభలో రాష్ట్రంలోని బర్నింగ్ టాపిక్కే చర్చకు వచ్చింది. రామేశ్వరం వెళ్లినా.. తప్పలేదన్నట్టుగా ఆ అంశంపై మాట్లాడేశారు. ఇదే ఇప్పుడు ఏపీ సచివాలయవర్గాల్లో చర్చగా మారింది. ఇంతకీ ఏంటా టాపిక్కు..? ఆదిత్యనాథ్ దాస్ వీడ్కోలు సభలోనూ ఆర్థిక కష్టాలపైనే చర్చ..! కొంతకాలంగా ఏపీ అనే మాట వినపడితే చాలు.. రాజకీయ, అధికార వర్గాల్లో ఆర్థిక కష్టాల గురించే […]
హుజురాబాద్ అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహారం నడిపిస్తోందా? సీరియస్ ఫైట్ ఇస్తుందా.. ఇంకెవరికైనా సాయపడాలని చూస్తోందా? మాజీ మంత్రి కొండా సురేఖ ఎందుకు బరి నుంచి తప్పుకొన్నారు? పార్టీ ముందు డిమాండ్ల చిట్టా పెట్టిన కొండా సురేఖ?చివరకు పోటీకి విముఖత వ్యక్తం చేసిన సురేఖ..! హజురాబాద్‌లో నామినేషన్ల ఘట్టం మొదలైనా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియదు. అభ్యర్ధి ఎంపిక కసరత్తును కొలిక్కి తెచ్చే పనిలో పడింది పార్టీ. మొదటి నుంచీ మాజీ మంత్రి కొండా సురేఖను […]
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో కొనసాగలేను.. బీజేపీలో చేరను అని ప్రకటించిన అమరీందర్.. మరో 15 రోజుల్లో కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉంది. కెప్టెన్ అమరీందర్‌తో ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,రైతు నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కొత్త పార్టీకి.. పంజాబ్ వికాస్ పార్టీ అని పేరు పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్,ఆప్, అకాలీదళ్ అసంతృప్త నేతలను అమరీందర్ కూడగట్టే ప్రయత్నాలు […]
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలో ఉంది. తొలి నుంచి సామాన్యుడి కష్టాలపై ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్ ఢిల్లీవాసులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలను ఢిల్లీ వీధుల్లో ‘చీపురు’తో ఊడ్చి పారేశారు. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చి సత్తా ఎంటో నిరూపించారు. సామాన్యుడి పార్టీగా ఆమ్ ఆద్మీ గుర్తింపు తెచ్చుకోవడంతో ఆపార్టీకి దేశ రాజధానిలో తిరుగు లేకుండా పోతుంది. సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ తో […]