మేడ్చల్ నియోజకవవర్గంలో కాంగ్రెస్ విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మల్లారెడ్డి పేదోళ్ల గుడిసెలు కూల్చి వారికి నిలువ నీడ లేకుండా చేసిండు అని ఆరోపించారు. పేదలపై ప్రతాపం చూపే అధికారులు.. చెరువులను మింగిన మల్లారెడ్డిపై చర్యలెందుకు తీసుకోరు అని ఆయన ప్రశ్నించారు. చెరువుల పక్కన భూములు కొని.. చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి.. ఇక్కడి ప్రజలకు కేసీఆర్ ఇచ్చిందేం లేదు.. ఒక్క జవహర్ నగర్ డంపింగ్ యార్డు తప్ప.. టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి కేసీఆర్ మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: Viral Video : ఊసరవెల్లి బిడ్డ పుట్టిన తర్వాత రంగులను ఎలా మారుస్తుందో చూడండి.. వీడియో..
కేసీఆర్ ఎన్ని వందల కోట్లకు టికెట్ అమ్ముకున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, మల్లారెడ్డి తొడు దొంగల్లా దోచుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ కు ఐటీ కంపెనీలు తెస్తామన్న హామీని తుంగలో తొక్కారు.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ఆయన ప్రకటించారు. కేసీఆర్ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగింది.. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైంది.. తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్ ను పొలిమేరలు దాటే వరకు తరమాలి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.