తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి గుర్తుల భయం పట్టుకుంది. ఎన్నికల అధికారులు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు రంగారెడ్డి జిల్లా అధికారులు గుర్తులు ఇచ్చారు. వీటి కోసం ఓటర్లు ఈజీగా గుర్తించుకునేలా, నిరక్షరాసులు కూడా తేలికగా తమ ఓటు హక్కును వేసేలా గుర్తులు కేటాయించారు.
Read Also: IND vs AUS World Cup Final: భారత్ టైటిల్ గెలవాలంటే.. రెచ్చిపోవాల్సింది విరాట్ కోహ్లీ కాదు!
అయితే, మనం నిత్యం వినియోగించే వస్తువులు, పరికరాలు, యంత్రాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్, కంప్యూటర్, లాప్ టాప్, గ్యాస్ స్టవ్, టీవీ రిమోట్, గ్యాస్ సిలిండర్, బాల్, పల్లకి, బ్యాట్, హాకీ స్టిక్, ఉంగరం, గాజులు, ఆపిల్, కెమెరా, ఐస్ క్రీమ్, టార్చ్ లైట్, పెట్రోల్ పంప్, కత్తెర, మైక్, టూత్ పేస్ట్, పండ్ల బుట్ట, క్యారం బోర్డ్, కుట్టు మిషన్, కుండలతో పాటు జనసేన గుర్తు గాజుగ్లాసును కూడా స్వతంత్ర అభ్యర్థులకు ఇచ్చింది. ఇక, గత ఐదేళ్లుగా బీఆర్ఎస్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో చపాతీ కర్ర, రోడ్డు రోలర్ వంటి గుర్తులు తమ పార్టీ గుర్తును పోలి ఉన్నాయని.. దీని వల్ల ఓటర్లను గందరగోళంలో పడేసి ఓట్లు చీలేలా చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ గుర్తులను స్వతంత్రులకు, ఇతర పార్టీలకు కేటాయించోద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
Read Also: Sreeleela: నడుము అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న శ్రీలీలా.. అబ్బా ఏమి అందం సామి..
కానీ, బీఆర్ఎస్ ఫిర్యాదును ఎన్నికల సంఘం కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. చపాతి కర్ర, రోడ్డు రోలర్ గుర్తులను కేటాయించ వద్దు అని చెప్పలేమంటూ ఈ అక్టోబర్ లో తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే యుగ తులసి పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని.. తమకు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని కోరింది. వారి వినతులను పరిశీలించిన తర్వాత ఎన్నికల్లో పోటీలో ఉన్న చోట ఈ గుర్తును ఇస్తాం.. యుగ తులసి పార్టీ పోటీలో లేని చోట వేరే వారికి కేటాయిస్తామ ఈసీ వెల్లడించింది.
Read Also: Anasuya : డీప్ బ్లౌజ్ లో ఇబ్బంది పడిన అనసూయ..
ఇక, యుగ తులసి పార్టీ అభ్యర్థులు ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. వీరికి ఇక్కడ రోడ్డు రోలర్ గుర్తును ఈసీ కేటాయించింది. మరోవైపు రోడ్డు రోలర్ గుర్తును రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మహమ్మద్ అబ్దుల్ అజీజ్ కు, స్వతంత్ర అభ్యర్థులుగా షాద్ నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో పోటీకి దిగుతున్న నరసింహ, తుడుము పాండులకు కేటాయించింది.