సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ‘మూర్ఖుల ప్రభువు’ ప్రకటనపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఇలాంటి విమర్శలు ప్రధానిగా గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడితే మంచిది కాదు.. ఎంత తక్కువ విమర్శలు చేస్తే అంత మంచిది అని ఆయన చెప్పుకొచ్చారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ పై సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కరెంట్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. లేదంటే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్ లో ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటాను అని ఆయన తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. మాజీ ఉద్యోగి టీసీఎస్ ఆఫీస్ కు బెదిరింపు కాల్ చేసినట్లు సమాచారం అందుతుంది.
జార్ఖండ్ పర్యటనలో భాగంగా రెండో రోజైన నేడు ప్రధాని నరేంద్ర మోడీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సుమారు 7200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇక, ఉలిహతు నుండి వికాస్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రధాని ప్రారంభించారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ డబ్బులు సంపాదించుకునేందుకు ఆయుధాలను అమ్ముతుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ గత ఏడాది రెండు ప్రైవేట్ అమెరికాకు చెందిన కంపెనీలతో ఆయుధ ఒప్పందాలలో $364 మిలియన్లు సంపాదించినట్లు తెలుస్తుంది.
ఛత్తీస్గఢ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. కాగా, ఇవాళ కాంగ్రెస్- బీజేపీ పార్టీలకు చెందిన అగ్ర నాయకత్వం అక్కడ ప్రచారం చేస్తుంది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక వైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్లో పర్యటిస్తున్నారు.
నేడు తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు చివరి రోజు. దీంతో ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ బరిలో నిలిచేదెవరో ఇవాళ ఖరారు కానుంది. ఇక, నామపత్రాల పరిశీలన అనంతరం 2898 మంది అభ్యర్థులు మిగిలినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
శాన్ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సుకు జో బైడెన్ ఆహ్వానం మేరకు జిన్పింగ్ వెళ్లారు. ఈ సమావేశం తర్వాత కాలిఫోర్నియాలో అమెరికా అధినేత జో బైడెన్- చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ భేటీ కానున్నారు.