నేడు కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పర్యటించనున్నారు. మధ్యాన్నం 1 గంటకి తొలుత మొదట కరీంనగర్ కు చేరుకోనున్నారు.. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాన్నం 2.30కి చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని గంగాధర లో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్న గులాబీ బాస్.. ఇక చివరగా సాయంత్రం 4 గంటలకి హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాలలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతారు.
Read Also: LIC Super Plan : ఎల్ఐసీ సూపర్ ప్లాన్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు..రూ. లక్ష పెన్షన్..
అయితే, ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరో వైపు ప్రతి సభలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఓటు ప్రజల చేతిలో ఉండే ఆయుధమని.. ఐదేళ్ల తమ భవిష్యత్ తమ చేతిలోనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్ సూచిస్తున్నారు. మరోవైపు బీజేపీపైనా గులాబీ బాస్ ధ్వజమెత్తుతున్నారు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఆ పార్టీకి ఉన్న మ తపిచ్చిని చిత్తు చిత్తుగా చేసి చెత్తకుప్పలో పడేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.