కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వండి అని తెలంగాణ ప్రజలకు మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పరుస్తాం.. ఉద్యోగాలు, సంక్షేమం అందించే బాధ్యత మాది అని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే.. ఆరు గ్యారంటీలు అమలులోకి వస్తాయి.. అన్ని రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పెరుగుతుంది.. కానీ ధరల నియంత్రణ, ఉద్యోగాల నియామకం సంగతి ఏమైంది.. కేసీఆర్ కి చరిత్ర సరిగ్గా తెలిసి ఉండదు.. తెలంగాణ స్టేట్ కాదు.. మద్రాస్ రాష్ట్రంగా ఉండే.. తెలుగు మాట్లాడే వాళ్లంతా ఒక రాష్ట్రంగా ఏర్పాటులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.. కేసీఆర్ అప్పట్లో నాకు ఏం చెప్పారు.. నేనేం చెప్పాను అనేది ఇద్దరికి తెలుసు అని చిదంబరం అన్నారు.
Read Also: Vote Selfie: ఓటేసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటే.. చిక్కుల్లో పడ్డట్లే..!
తెలంగాణా బిల్లు పాస్ అవ్వడానికి ముందు బిల్లు పాస్ అయ్యాకా కేసీఆర్ ఏం మాట్లాడారో మాకు తెలుసు అని చిదంబరం తెలిపారు. కేసీఆర్ లాగా వ్యక్తుల సామర్థ్యం గురించి మాట్లాడను.. ప్రతీ జనరేషన్ లో ఓ మంచి నాయకుడి వస్తారు.. తెలంగాణ కాంగ్రెస్ లో కేపబుల్ లీడర్స్ ఉన్నారు.. తెలంగాణని సేఫ్ గా చూస్తారు.. ప్రజలు ఆరు గ్యారంటీలను నమ్ముతున్నారు.. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లో 12 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారంటే అది పార్టీ బలం.. కాంగ్రెస్ లో 12 మంది సమర్థవంత నేతలు ఉన్నారు అని అర్థం.. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం అందుకు నిదర్శనం అని చిదంబరం వెల్లడించారు.
Read Also: Nandamuri Balakrishna: ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన బాలకృష్ణ.. ప్రభుత్వంపై ఫైర్
లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర గురించి నాకు తెలియదు అని చిదంబరం చెప్పారు. ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్‌లో ఏముందో కూడా నేను చదవలేదు.. కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చేశాడు అంటే పొరపాటు.. ప్రజలకి సంబంధం లేదని చెప్పాలని అనుకుంటుంటే తప్పు.. ప్రజలు ఆయనకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు.. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలు త్యాగం చేశారు.. ఏపీ కోసం పొట్టి శ్రీరాములు దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు.. ఆయన త్యాగం కన్నా కేసీఆర్ దీక్ష గొప్పది కాదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమం.. ప్రజల పోరాటం అది అని చిదంబరం పేర్కొన్నారు.