శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. చిలకపాలేంలో ఎన్ఏసీఎల్ నాగార్జున కెమికల్స్ ఫ్యాక్టరీ విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతుందన్నారు. ఆ కాలుష్యం భూమిలోకి పోతుంది.. పోందురు మండలంలోని జల వనరులన్నీ కలుషితమై పోతున్నాయన్నారు. ఆయా గ్రామాల్లో పిల్లలు అంగవైకల్యంతో పుడుతూ.. క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆయన వ్యాఖ్యనించారు. ఫ్యాక్టరీతో గాలి కూడా కాలుష్యం అవుతోంది.. మా ఊళ్లో మా ఇంటి దగ్గరకు కూడా గాలి కాలుష్యంతో దూలి వస్తుందన్నారు. కాలుష్యం బారిన పడకుండా గ్రామాల వారికి మంచి నీటిని ఇవ్వాలని నిర్ణయించాం.. నాగావళి నది నుండి గండ్రేడు దగ్గర పంప్ హౌస్ పెట్టి.. 2లక్షల నీటిని పంప్ చేయనున్నామని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు.
Read Also: Tragedy: సాంబార్ గిన్నెలో పడి రెండో తరగతి బాలిక మృతి
80 కోట్ల రూపాయలతో భారీ నీటి సరఫరా ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తున్నామని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం పేర్కొన్నారు. రాజకీయంగా నేను విమర్శించను.. గెలిపించారు కాబట్టి నా పని నేను చేసుకుంటా అని ఆయన తెలిపారు. కూన రవి నీటి సరఫరా ఇంజనీర్లను ఫోన్ చేసి బెదిరించాడు.. మూడు సార్లు చంద్రబాబుకి అవకాశం ఇస్తే.. టీడీపీ వారు ఏం చేశారు.. ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు చంద్రబాబు.. సంక్షేమ పథకాలు నీ హయాంలో ఏందుకు చేయలేకపోయావ్.. ప్రజల ద్వారా వచ్చిన పన్నుల డబ్బుని ప్రజలకే ఇస్తున్నారు.. చంద్రబాబు మాత్రం దొరికింది దొరికినట్లుగా దోపిడి చేశాడు అని తమ్మినేని సీతారం అన్నారు.
Read Also: Supreme Court: మరో రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్ చేసినా.. ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చు..
ఆలీబాబా నలబై దోంగలు దారి దోపిడి దోంగల మాదిరిగా టీడీపీ వారు దోచుకున్నారు అని స్పీకర్ సీతారం ఆరోపించారు. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, వీఐపీగా చేసిన కూన రవి సొంత మండలానికే ఏం చేయలేకపోయారు.. నన్ను మాజీ చేయడానికి కూన రవి ఎవరు.. ప్రజలు, దేవుడే అంతిమ నిర్ణేతలు అంటూ ఆయన వ్యాఖ్యనించారు. మొన్న రోడ్లు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు.. నియోజకవర్గంలో రోడ్లు వేసింది కూన రవి సోదరులేకదా.. బైట వ్యక్తులను ఎవరిని రోడ్లు వేయనివ్వలేదు కూన రవి.. మీరు వేసిన రోడ్లు వర్షాలుకే కోట్టుకు పోయింది.. రెల్లిగెడ్డ డ్యామ్
మొత్తం కోట్టుకుపోయింది అంటూ స్పీకర్ తమ్మినేని సీతారం వెల్లడించారు.