ప్రధాని మోడీ షెడ్యూల్ ఖరారు అయింది. ఈనెల 25వ తేదీన కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఇక, 26వ తేదీన తుఫ్రాన్, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు
మంథని చౌరస్తాలో నడి రోడ్డుపై నిల్చుంటా బీఆర్ఎస్ నేతలను వచ్చి నన్ను చంపమను అంటూ పోలీసులపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి మహాముత్తారంలో ఓడేడు సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
స్థానికేతరులైన చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల అన్నయ్య కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డిలను మన నియోజకవర్గం నుంచి చిత్తుచిత్తుగా ఓడించి తరిమికొట్టాలని బహుజన్ సమాజ్ పార్టీఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లాలోని చించోలి - బిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు రైతు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
వనపర్తి అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన టీఎస్ ఆర్టీసీ టీఎంయూ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.
దమ్ముంటే అభివృద్ధి పైన మాట్లాడు.. లేదా బహిరంగ చర్చకు దా.. వివేక్ కి అతనిపై అతనికే నమ్మకం లేదు.. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మారితే జనం ఎలా నమ్మతారు.. వివేక్ ఖచ్చితంగా ఓడి పోతారు.. అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం అంటూ వివేక్ వెంకటస్వామికి బాల్క సుమన్ సవాల్ విసిరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతుంది. తాజాగా.. ప్రముఖ సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి జ్యోతి గడపగడపకు తిరిగి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూడండి.. బీఆర్ఎస్ను గెలిపించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆమె కోరారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా జై కాంగ్రెస్... జై సత్తన్న నినాదాలతో మొగుళ్ళపల్లి బస్టాండ్ సెంటర్ దద్దరిల్లింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుండ బద్దలు కొట్టినట్లు అసలు విషయం చెప్పారు అని మంత్రి హరీష్ రావు అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లే నిధులు ఇవ్వలేదని చెప్పారు..