ఈనెల 25న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ తరఫున జనసేన అధినేత వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో బీజేపీ-జనసేన నిర్వహించే బహిరంగ సభ కోసం ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా, తాండూర్ లో ఉన్న యువతకు కావాల్సిన పలు రకాల అంశాలను ఈ సభలో పవన్ కళ్యాణ్ తెలియజేయనున్నారు.
Read Also: Nithiin: త్రిషకు సపోర్ట్ గా నితిన్.. నీచమైన వారికి సమాజంలో స్థానం లేదు
గతంలో ఉన్న నాయకులు తాండూర్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని చాలా మంది యువత ఉద్యోగాలు లేక, నిరుద్యోగులుగా మిగిలి పోవడమే కాకుండా తాండూర్ ప్రాంతాల్లోని కర్మాగారాలలో రోజువారి కూలీలుగా పనిచేయడం జరుగుతుందని బీజేపీ- జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గౌడ్ అన్నారు. అంతే కాకుండా జనసేన అభ్యర్థిని గెలిపించినట్లైతే.. తాండూర్ ప్రాంతానికి చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ ఈ బహిరంగ సభలో చెప్పబోతున్నారు అని ఆయన పేర్కొన్నారు. కల్లబొల్లి మాటలు చెబుతూ తాండూర్ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని జనసేనకు ఒక్క సారి అవకాశం ఇస్తే తాండూరు దిశా మార్చి చూపిస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేమురి శంకర్ గౌడ్ తెలిపారు.