భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా జై కాంగ్రెస్… జై సత్తన్న నినాదాలతో మొగుళ్ళపల్లి బస్టాండ్ సెంటర్ దద్దరిల్లింది. మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట జీఎస్సార్ ప్రజా దీవెన యాత్ర కొనసాగింది. ప్రజా దీవెన యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
Read Also: World Cup 2023: భారత్ బాగా ఆడలేదు.. నిజం ఒప్పుకోవాల్సిందే: గౌతమ్ గంభీర్
గండ్ర సత్యనారాయణ రావుకి మంగళ హారతులిచ్చి, శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, బంతిపూలు చల్లి మహిళలు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రజా దీవెన యాత్రలో గండ్ర సత్యనారాయణ రావు, కటంగూరి రామ నర్సింహారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మొగుళ్లపల్లి ఎంపీటీసీ ఎర్రబెల్లి వనిత – పూర్ణ చందర్ రావు, ఆకినపల్లి గ్రామ ఎంపీటీసీ రొంటాల రాజేశ్వరి – సంపత్, ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ గడ్డం శ్రీనివాస్ తో పాటు మరో 50 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారందరికీ, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి గండ్ర సత్యనారాయణ రావు, కటంగూరి రామ్ నర్సింహారెడ్డి ఆహ్వానించారు.
Read Also: Harish Rao: అందుకే నిధులు ఇవ్వట్లేదని ఆర్థిక మంత్రే ఒప్పుకుంది.. హరీశ్ రావు కామెంట్స్
ధన బలం, ప్రజాబలం మధ్య భూపాలపల్లిలో ఎన్నిక జరుగుతుందని గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనడానికి వస్తున్నారు.. ఐదు వేలిచ్చినా, పది వేలిచ్చినా తీసుకోండి.. అది సొమ్మే.. నాకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి.. 24 గంటలు అందుబాటులో ఉండి సేవకుడిగా పని చేస్తానని జీఎస్సార్ పేర్కొన్నారు. గండ్ర సత్తన్న భూపాలపల్లిలో లక్ష మెజారిటీతో గెలవబోతున్నాడని కటంగూరి రామ్ నర్సింహారెడ్డి అన్నారు.