Himanta Biswa Sharma: వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమిపై అసలు కారణం చెప్పిన అసోం సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ 2023 లీగ్ దశలో అత్యద్భుతంగా ఆడి ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం భారత జట్టు ఓటమి పాలవ్వడంతో భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే, ఈ ఓటమికి రకరకాల కారణాలు చూపుతూ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో విశ్లేషణలు కాస్త శ్రుతిమించి రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలకు దారి తీశాయి. ఇక, తాజాగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ తరహా కామెంట్స్ చేశారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజు ఇందిరాగాంధీ జన్మదినం కావడంతోనే టీమిండియా ప్రపంచ కప్‌ను కోల్పోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
Read Also: Vijayawada: భవాని మండల దీక్ష ధారణ.. ఇంద్రకీలాద్రి పై నేటి నుండి ప్రారంభం
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
- Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
- Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
వరల్డ్ కప్ లో టీమిండియా అన్ని మ్యాచ్‌లు గెలిచింది.. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఓడిపోయాం.. ఆ మ్యాచ్‌లో మనం ఎందుకు ఓడిపోయామాని నేను ఎంక్వైరీ చేశాను అని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజున వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడటం వల్లే భారత జట్టు విఫలమైంది అని ఆయన విమర్శించారు. బీసీసీఐకి నా దగ్గర ఒక సలహా.. దయచేసి గాంధీ కుటుంబ సభ్యుల పుట్టిన రోజుల్లో టీమిండియా మ్యాచ్‌లు పెట్టొద్దని బిశ్వశర్మ సూచించారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ విషయాన్ని నేను తెలుసుకున్నానని ఆయన వ్యాఖ్యనించారు.
Read Also: KIMS Hospital: కిమ్స్ ఆస్పత్రిలో మంటలు.. తీవ్ర ఇబ్బందులుపడ్డ రోగులు
కాగా, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడంతో పవర్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియానికి వెళ్లడంతో దురదృష్టం వెంటాడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోడీని ప్రస్తావిస్తూ ‘పనౌటీ’ అని రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.. ఇదిలా ఉండగా గత ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా కూడా స్టేడియానికి వెళ్లారు.
తాజావార్తలు
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!