46 రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో నాలుగు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించారు. ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ తన జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా మహిళలు, పిల్లలను విడుదల చేయడానికి బదులుగా, అక్టోబర్ 7న కిడ్నాప్ చేసి బందీలుగా ఉన్న వారిలో 50 మందిని హమాస్ విడుదల చేస్తుంది. గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ సమయంలో బందీలు, ఖైదీల ఈ మార్పిడి జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పట్టుదలతో ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది.. కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్‌తో సహా యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేసింది.
Read Also: YSR Kalyanamasthu: వారికి గుడ్‌న్యూస్.. ఈ రోజే ఖాతాల్లో సొమ్ము జమ
దీనివల్ల గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోతున్న అమాయకుల ప్రాణాలు కాపాడడంతో పాటు అక్కడి 23 లక్షల జనాభా జీవితాల్లో ఇబ్బందులు తగ్గుతాయి. దీంతో చిన్న నేరాలకు పాల్పడి ఏళ్ల తరబడి ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా మహిళలు, చిన్నారులను విడుదల చేయడం సాధ్యమవుతుంది. ప్రతిఫలంగా, ఒకటిన్నర నెలలుగా హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు స్వదేశానికి తిరిగి రావడం సాధ్యమవుతుంది. కాల్పుల విరమణ ముగిసిన నాలుగు రోజుల్లోనే 50 మంది ఇజ్రాయెలీ బందీలను విడుదల చేస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది.
Read Also: Raipur : రాయ్‌పూర్‌లోని ఫైవ్ స్టార్ హోటల్ బాబిలోన్‌లో భారీ అగ్నిప్రమాదం
ఇజ్రాయెల్ నుండి కిడ్నాప్ చేయబడిన 240 మంది ప్రస్తుతం హమాస్ బందీలుగా ఉన్నారు. అపహరణకు గురైన వారిలో ఇప్పటి వరకు ఐదుగురు మహిళలను హమాస్ విడుదల చేయగా.. ఇద్దరు మహిళలు మరణించారు. నిన్న ఉదయం ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆరు గంటల చర్చలు జరిపి ఆమోదం తెలిపిన తరువాత.. ఈ ఒప్పందాన్ని పార్లమెంటు కూడా ఆమోదించింది. కొన్ని చర్చల తర్వాత ఇవాళ (గురువారం) ఉదయం నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇక, గాజాలో ఇజ్రాయెల్ సైన్యం- హమాస్ మధ్య కాల్పులు ఆగిపోతుండటంతో పాటు బందీలు, ఖైదీల విడుదల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
Read Also: Sandeep Reddy Vanga: ఇదెక్కడి మాస్ వార్నింగ్ అన్న…
ఇక, కాల్పుల ఒప్పందానికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రకటనలో విడుదల చేయాల్సిన పాలస్తీనా ఖైదీల సంఖ్యను పేర్కొనలేదు.. అయితే 150 నుండి 300 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయవచ్చని సమాచారం. వీరిలో అధిక సంఖ్యలో వెస్ట్ బ్యాంక్ నుండి అరెస్టైన పాలస్తీనియన్లు ఉండవచ్చు. ఇజ్రాయెల్ భద్రతా దళాలు గాజా స్ట్రిప్ సమీపంలో ఉన్న వెస్ట్ బ్యాంక్ నుండి మూడు వేల మందికి పైగా అరెస్టు చేశారు. కాల్పుల విరమణ సమయంలో, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్‌లు గాజాలో నిలిపివేస్తారు. ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడుల్లో 1,200 మంది మరణించగా, అప్పటి నుండి కొనసాగుతున్న ఇజ్రాయెల్ సైనిక చర్యలో సుమారు 14,000 మంది పాలస్తీనియన్లు మరణించారు.