Messi vs Revanth Reddy: నేడు రేవంత్‌రెడ్డి vs మెస్సీ మ్యాచ్.. టైమ్, పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Messi vs Revanth Reddy: ఫుట్‌బాల్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ లియోనెల్ మెస్సీ vs సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ నేడు (శనివారం) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్‌లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ మ్యాచ్ కోసం దాదాపు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే.. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. షెడ్యూల్ లో భాగంగా డిసెంబర్ 13 (శనివారం)న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య కోల్‌కతా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటాడు. శంషాబాద్ చేరుకున్న వెంటనే మెస్సీ నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళతాడు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెస్సీతో ఫొటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్లు బుక్ చేసుకున్న 100 మంది అదృష్టవంతులతో స్టార్ ప్లేయర్ ముఖాముఖీగా మాట్లాడి, ఫోటోలు దిగనున్నాడు.
READ MORE: Jagtial District: తమ్ముడు ఎన్నికల్లో ఓటమి.. గుండెపోటుతో అక్క మృతి..
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ చిన్నారుల ఫుట్‌బాల్ జట్టుతో 15 నిమిషాలపాటు సంభాషించి, కొన్ని ఫుట్‌బాల్ మెళకువలు తెలపనున్నాడు. ఆపై సాయంత్రం 7 గంటలకు ప్రధాన ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇందులో సంగీత కార్యక్రమం సహా పలు ఆకర్షణలు ఉంటాయి. 7.30కి ప్రత్యేక మ్యాచ్ జరుగనుంది. సింగరేణి RR జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా.. అపర్ణ మెస్సీ టీమ్ తరఫున మెస్సీ ఆడనున్నారు. మెస్సీతో పాటు అతని స్నేహితులైన రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొనబోతున్నారు. అయితే మ్యాచ్ చివరి ఐదు నిమిషాల్లో మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్‌లోకి ప్రవేశించి ఆడనున్నారు. మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు GOAT ట్రోఫీని మెస్సీ, రేవంత్ రెడ్డి కలిసి ప్రధానం చేయనున్నారు. ఈవెంట్ ముగిసిన తర్వాత మెస్సీ తిరిగి ఫలక్‌నుమాకు వెళ్లి అక్కడే రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ముంబైకి పయనమవుతారు.అయితే.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!