ఎన్నికల సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 10 గ్యారంటీలు ఇచ్చింది అని ఆ రాష్ట్ర మాజీ సీఎం జై రాం ఠాకూర్ అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ఇప్పటి వరకు ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేదు అని ఆయన ఆరోపించారు. ఇక్కడ కాంగ్రెస్ హిమాచల్ లో ఇచ్చిన హామీలు అమలు చేశామని చెబుతున్నారు.. 18 ఏళ్ల దాటిన మహిళకు ప్రతి నెల 15 వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఒక మహిళకు ఇవ్వలేదు.. ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి విద్యుత్ ఛార్జ్ లు పెచ్చింది అని జైరాం ఠాకూర్ మండిపడ్డారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆవు పేడ కిలో రెండు రూపాయలకే కొంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అని మాజీ సీఎం జై రాం ఠాకూర్ అన్నారు. ఉద్యోగులకు OPS పై మొదట కేబినెట్ లోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.. కానీ, ఇప్పటి వరకు అమలు చేయలేదు.. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుంది.. అంతట అవినీతే కనిపిస్తుందని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పోవాలని.. నేతలకు శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.. కాంగ్రెస్ అబద్ధపు గ్యారంటీలు మీ ముందు ఉంచేందుకు వచ్చాను.. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీల వీడియోలను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జై రాం ఠాకూర్ ప్రదర్శించారు.