తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్తారు.. అయితే, నిన్న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై నేడు హైకమాండ్ పెద్దలతో సీఎం చర్చించబోతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే, నేడు మీడియా ఎదుట నిందితులను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితున్ని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గత నెల 28 నుంచి డిసెంబర్ 13 వరకు ప్రసాద్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఒక్కో చోటకి తీసుకెళ్ళి నర హంతకుడు హత్య చేశాడు.
మన్యం జిల్లాలో సాగునీటి, తాగునీటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు అని ఆమె విమర్శలు చేశారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలి.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా దీవించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.
ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ కార్డులో క్యూ ఆర్ కోడ్, లద్ధిదారుని ఫోటో, లబ్ధిదారుని ఆరోగ్య వివరాలు ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
విశాఖపట్నంలోని పోలిపల్లిలో టీడీజీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర యువగళం ముగింపు బహిరంగ సభలో టీడీపీ- జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల శంఖారావం పురిస్తామని ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఇస్లాం మతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇస్లాం సంస్కృతి, యూరోపిన్ నాగరికతలోని విలువలు, హక్కులకు చాలా తేడాలు ఉన్నాయని ఆమె అన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులను మట్టికరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తుంది.
విశాఖపట్నంలో లంకే బిందలు, గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాటి చెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్ లో ఇంటి ఆవరణంలో పూజలు చేసి తవ్వినట్లు ఆనవాళ్లు లభించాయి.