నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే, నేడు మీడియా ఎదుట నిందితులను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితున్ని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గత నెల 28 నుంచి డిసెంబర్ 13 వరకు ప్రసాద్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఒక్కో చోటకి తీసుకెళ్ళి నర హంతకుడు హత్య చేశాడు. కామారెడ్డి అటవీ ప్రాంతంలో ప్రసాద్ హత్యగావించబడ్డాడు.. ప్రసాద్ భార్య రమణిని బాసర గోదావరిలో తోసి హత్య చేయగా.. కవల పిల్లలను బాల్కొండ సమీపంలోని సొన్ బ్రిడ్జి వద్ద హంతకుడు హతమార్చాడు.
Read Also: Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. నేడు తులం ఎంతుందంటే?
ఇక, ప్రసాద్ చెల్లెలు స్వప్న మెదక్ జిల్లా చేగుంట వడియరం సమీపంలో కల్వర్టు దగ్గర నర హంతకుడు హత్య చేశాడు. చిన్న చెల్లెలు స్రవంతినీ కామారెడ్డి జిల్లా సదా శివ నగర్ మండలం భూం పల్లి దగ్గర హత్య చేసి శవాన్ని నిందితుడు తగుల బెట్టాడు. అలాగే, డిసెంబర్ 13 కేసు నమోదు కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ మిస్సింగ్ కాాగా.. ప్రస్తుతం ఆమె సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: China : చైనాలో భారీ భూకంపం.. 90 మందికి పైగా మృతి, 200మందికి గాయాలు
అయితే, వరుస హత్యల నిందితుడు విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్నేహితుని ఇంటిపై ఆశతో కుటుంబాన్ని నర హంతకుడు ప్రశాంత్ కడతేర్చాడు. హత్యలు చేసి ఆనవాళ్ళు లేకుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు. ఆరు హత్యలు జరగ్గా, ఇప్పటి వరకు నాలుగు మృత దేహాలు లభ్యం అయ్యాయి.. ఆచూకీ దొరకని మరో రెండు మృత దేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.ప్రసాద్ తో పాటు భార్య రమణిమృత దేహాల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. సాంకేతిక అధారాలతో ప్రధాన నిందితున్ని పట్టుకున్నారు.. నిందితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.. ఆరు హత్యల ఉదంతం వెలుగులోకి రావడంతో సీరియల్ కిల్లర్ సహా ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురి హత్యలో ప్రధాన నిందితునికి సహకరించిన మరో నలుగురిని నేడు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.