నేడు ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి.. ఉదయం 9 గంటలకు ఢిల్లీకి పయనం.. అధిష్టానం పెద్దలతో భేటీకానున్న సీఎం.. ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై చర్చ..
నేడు ఉదయం 10గంటల నుంచి మధ్నాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం.. ప్రజావాణిలో పాల్గొననున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రజల దగ్గర నుంచి అర్జీలను తీసుకొనున్న మంత్రి, అధికారులు..
నేడు ఆర్ధిక శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ.. ఇసుక కేటాయింపుల కేసులో విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు..
నేడు వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలపై వర్క్ షాప్.. హాజరుకానున్న మంత్రి గోవర్ధన్ రెడ్డి
నేడు కర్నూలు జిల్లా డోన్ మండలంలో పర్యటించనున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం..
నేడు విశాఖలోని షీలానగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించనున్న ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి..
పరిశీలన…
నేడు భోగాపురం మండలం పోలిపల్లి వద్ద యువగళం సభాస్థలిని పరిశీలించనున్న నారాలోకేష్..
నేడు తిరుమలలో శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
నేడు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాధన సేవలు రద్దు..
నేడు భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా నిజరూప రామావతారంలో దర్శనం ఇవ్వనున్న శ్రీరాముడు..
నేడు మధ్యాహ్నం 3గంటలకు ఇండియా కూటమి సమావేశం.. నాలుగోసారి భేటీకానున్న ఇండియా కూటమి నేతలు..
నేడు దక్షిణాఫ్రికాతో భారత్ రెండో వన్డే.. గబెరా వేదికగా సాయంత్రం. 4.30 గంటల నుంచి మ్యాచ్.. 1992 నుంచి సౌతాఫ్రికాతో 6 ద్వైపాక్షిక వన్డే సిరీస్ లు ఆడిన టీమిండియా.. ఒక్కసారే సిరీస్ విజయాన్ని అందుకున్న భారత్..