Bandi Sanjay: ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదములు.. అటల్- మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమం అద్భుతమైనది.. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.. దేశంలో చరిత్ర సృష్టించింది ఏపీ.. ప్రతీ జిల్లాలో వాజ్ పేయ్ విగ్రహాలు పెట్టించడం నిజంగా అద్భుతం అన్నారు. తెలిపారు బండి సంజయ్.
Read Also: India T20 World Cup 2026 Squad: టీ 20 వరల్డ్ కప్‌కు టీమిండియా జట్టు ఇదే.. పాపం గిల్!
అయితే, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక మేము కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. విశాఖకు చాలా సార్లు వచ్చిన కానీ, వచ్చిన ప్రతీ సారి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది.. పోరాటాల గడ్డ విశాఖ అడ్డా.. విశాఖ నేవీకి బలం, పరిశ్రమలకు ముఖ ద్వారం అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ.. పవిత్ర గడ్డ మీద వాజ్ పేయ్ విగ్రహ ఆవిష్కరణ అవకాశం నా పూర్వ జన్మ సుకృతమన్నారు. కాగా, RSS కేవలం ఒక సంస్థ కాదు.. వాజ్ పేయ్ కి బీజేపీ, ఒక వర్గం ప్రజలు మాత్రమే కాదు యావత్ భారత్ అండగా నిలబడిందని బండి సంజయ్ పేర్కొన్నారు.
Read Also: HYDRA Lake Restoration: చారిత్రక చెరువుకు హైడ్రా పునర్జన్మ..
ఇక, తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ను దేశం నుంచి తరిమి కొట్టాలి.. దేశంలో మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.. ఏపీలో కూకటి వేళ్ళతో పెకిలించి సముద్రంలో కలిపారు.. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది.. ఏపీని స్పూర్తిగా తీసుకొని మేము తెలంగాణలో అధికారంలోకి వస్తాం.. తెలంగాణలో కాంగ్రెస్ బోర్లపడింది.. ఇచ్చిన హామీలను అమలు చేయలేక పోతుంది.. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయాడు.. క్రియశీలకంగా లేరు.. ప్రజలు కూడా ఆయన్ని మర్చిపోయారు.. కేసీఆర్ పాలనతో విసిగి.. మనకు పడాల్సిన ఓట్లు కాంగ్రెస్ పడ్డాయని పేర్కొన్నారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు మోడీ సర్కార్ నిధులేనని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.