HYDRA Lake Restoration: నిజాంల నాటి చారిత్రక చెరువుకు హైడ్రా పునర్జన్మను ప్రసాదించింది. చెరువు ఆక్రమణలు తొలగించి బమ్రుక్న్ ఉద్దౌలా చెరువును హైడ్రా తిరిగి అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో జనవరిలో బమ్రుక్న్ ఉద్దౌలా చెరువు ప్రారంభానికి హైడ్రా సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
READ ALSO: PM Modi: బీహార్ అయిపోయింది, ఇక బెంగాల్‌లో జంగిల్ రాజ్ పోవాలి..
ఈ సందర్భంగా ఆయన చెరువుకు సులభంగా చేరుకునేలా రహదారులు, ప్రవేశ ద్వారాల ఏర్పాటు, బండ్‌పై వాకింగ్ ట్రాక్‌లు, లోపల ఫెన్సింగ్ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల కోసం ప్లే ఏరియాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పార్కులు, ఓపెన్ జిమ్‌లతో విహార కేంద్రంగా ఈ చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువు పరిసరాలలో ఔషధ గుణాలున్న మొక్కలు, పచ్చని వాతావరణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అలాగే నిజాంల కాలంలో వాడిన రాతితో కట్టడాల పటిష్టతపై కూడా పని చేస్తున్నట్లు చెప్పారు.
ఇన్ లెట్‌లు, ఔట్ లెట్‌లు విశాలంగా నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్‌ల నుంచి వచ్చే వరద నీరు చెరువులో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు, వరద సమస్యలకు చెక్ పెట్టేలా చెరువును అభివృద్ధి చేస్తున్నామన్నారు. చెరువు పరిసరాల్లో సీసీటీవీ కెమేరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఏడాది ఆగస్టులో హైడ్రా ఈ చెరువు ఆక్రమణలు తొలగించింది. ఈ సందర్భంగా హైడ్రా పనిపై స్థానికుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీకి బమ్రుక్న్ ఉద్దౌలా చెరువు మణిహారంగా మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: India T20 World Cup 2026 Squad: టీ 20 వరల్డ్ కప్‌కు టీమిండియా జట్టు ఇదే.. పాపం గిల్!