ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ కార్డులో క్యూ ఆర్ కోడ్, లద్ధిదారుని ఫోటో, లబ్ధిదారుని ఆరోగ్య వివరాలు ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆయన ప్రారంభించారు. ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేస్తున్నాం.. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీలో జరుగుతున్న మార్పులు విప్లవాత్మకమైన మార్పులు అంటూ సీఎం జగన్ తెలిపారు.
Read Also: Ponguleti: ఖజానాను ఖాళీ చేసి ఇచ్చారు.. అయినా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం..
ఇక, రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదనే ఉద్ధేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆరోగ్య శ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి.. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఒక వరం.. 4 కోట్ల 25 లక్షల మందికి ఈ ఆరోగ్యశ్రీ పథకం వర్తింప జేశామన్నారు. ఆరోగ్య శ్రీలో చికిత్సల సంఖ్యను కూడా పెంచామని సీఎం జగన్ వెల్లడించారు.