గాంధీ భవన్ లో పీసీసీ పొలిటికల్ కమిటీ సమావేశం..
గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్ కు ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రే అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి. హనుమంతరావు తదితరులు వచ్చారు. అయితే, కాంగ్రెజ్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇంచార్జ్ లుగా పని చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కునర్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు చెపుతూ తీర్మానం చేశారు. దీంతో ఆ తీర్మానాన్ని సమావేశంలో ప్రవేశ పెట్టగా ఏకగ్రీగంగా సభ్యులు ఆమోదం తెలిపారు.
సీపీఐ వల్లే కాంగ్రెస్ విజయం.. లోక్ సభకు పోటీచేస్తాం
సీపీఐ ఓట్లు కలవడం వల్లే కాంగ్రెస్ విజయం సాధించారని, తెలంగాణలో ఎంపీ సీటుకు పోటీ చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రకటన సంచలనంగా మారింది. సీపీఐ పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలన్నారు. రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడి పోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అందరినీ కలుపుకుపోయింది కాబట్టి కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. కేరళలో 4, తమిళనాడు 2, బెంగాల్ 3, బస్తర్ లోని ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని ఇక.. తెలంగాణలో ఒక ఎంపీ, ఏపిలో ఒక ఎంపీ సీట్లో పోటీ చేస్తామని క్లారటీ ఇచ్చారు. బతికి వుండగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టుకుంటున్నారని మండిపడ్డారు.
దామోదర రాజనర్సింహ నాపై కుట్ర చేస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
మెదక్ జిల్లాలో దళితబంధు లొల్లి షురూ అయ్యింది. ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తమ్ముడు రాహుల్ కిరణ్ దళితబంధు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తమ్ముడు రాహుల్ కిరణ్ పై టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో పల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య ఫిర్యాదు చేయడంతో అసలు భాగోతం బయటకు వచ్చింది. పల్వంచ గ్రామంలో నలుగురు దళితుల నుంచి 3 లక్షల చొప్పున 12 లక్షలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి, తమ్ముడు రాహుల్ కి ఇచ్చామని భూమయ్య చెబుతున్నాడు. దళితబంధు రాకపోవడంతో డబ్బులు అడిగితే సృజన్ అనే వ్యక్తి చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయంపై తనపై వస్తున్న ఆరోపణలపై ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. భూమయ్య చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. కేవలం రాజకీయ కక్షతో ఇలా నాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తను తప్పు చేస్తే లై డిటెక్టర్ పరీక్షకు కూడా రెడీ అన్నారు. కావాలనే మంత్రి దామోదర రాజనర్సింహ ఇలా కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు.
పేదవారికి ఖరీదైన వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం..
ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ కార్డులో క్యూ ఆర్ కోడ్, లద్ధిదారుని ఫోటో, లబ్ధిదారుని ఆరోగ్య వివరాలు ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆయన ప్రారంభించారు. ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేస్తున్నాం.. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీలో జరుగుతున్న మార్పులు విప్లవాత్మకమైన మార్పులు అంటూ సీఎం జగన్ తెలిపారు. ఇక, రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదనే ఉద్ధేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆరోగ్య శ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి.. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఒక వరం.. 4 కోట్ల 25 లక్షల మందికి ఈ ఆరోగ్యశ్రీ పథకం వర్తింప జేశామన్నారు. ఆరోగ్య శ్రీలో చికిత్సల సంఖ్యను కూడా పెంచామని సీఎం జగన్ వెల్లడించారు.
టీడీపీ- జనసేన కలిసి ఎన్నికల శంఖారావం పురిస్తాం..
విశాఖపట్నంలోని పోలిపల్లిలో టీడీజీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర యువగళం ముగింపు బహిరంగ సభలో టీడీపీ- జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల శంఖారావం పురిస్తామని ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సభ వేదికపై టీడీజీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరవుతారు అని ఆయన పేర్కొన్నారు. ఇక, తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్నడూ జరగ లేనంత భారీ ఎత్తున ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఏయూలో బహిరంగ సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంది అని విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు ఇవ్వకుండా జగన్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అడ్డుకున్న కానీ, ఆరు ప్రత్యేక రైళ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయి.. రెండున్నర లక్షల మంది పట్టే విధంగా సీటీంగ్ ఏర్పాట్లు చేశాము.. జనసేన, టీడీపీలు కలిసికట్టుగా ఏ విధంగా పని చేస్తున్నాయనేది ఒక మెస్సేజ్ ఇస్తాం.. ఉత్తరాంధ్ర తర్వాత మరో మూడు బహిరంగ సభలు జరుగుతాయన్నారు. అయితే, టీడీపీ- జనసేన రెండో బహిరంగ సభలో మేనిఫెస్టో ప్రకటన విడుదల చేస్తామని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. సౌత్ ఇండియాలో 19 చోట్ల తనిఖీలు..
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులను మట్టికరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే దక్షిణ భారతదేశంలోని చాలా చోట్ల ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని 19 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఉగ్రవాద సంస్థ ఐఎస్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కేంద్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కర్ణాటకలో 11 కేంద్రాలు, జార్ఖండ్‌లో నాలుగు కేంద్రాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి మహారాష్ట్రలో మూడు చోట్ల, ఢిల్లీలో ఒక చోట ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
గత వారం మహారాష్ట్రలోని 40 కేంద్రాలపై ఎన్‌ఐఏ దాడులు చేసింది. విచారణలో 15 మందిని అరెస్టు చేశారు. వారిలో ఒకరు ఐఎస్ కు సంబంధించిన వ్యక్తిగా గుర్తించింది. గత వారం జరిపిన సోదాల్లో లెక్కల్లో చూపని డబ్బు, కొన్ని పత్రాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వారి ఇళ్లలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.
ఇస్లాం మతంపై ఇటలీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఇస్లాం మతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇస్లాం సంస్కృతి, యూరోపిన్ నాగరికతలోని విలువలు, హక్కులకు చాలా తేడాలు ఉన్నాయని ఆమె అన్నారు. అందుకే యూరప్ లో ఇస్లాంకు చోటు ఉండబోదు అంటూ చెప్పుకొచ్చారు. సౌదీ అరేబియాలోని షరియా చట్టాల గురించి పరోక్షంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని విమర్శలు గుప్పించారు. అయితే, ఇస్లాం సంస్కృతికి, మా యూరోపియన్ నాగరికతకు చాలా తేడాలు ఉంటాయని ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అన్నారు. సౌదీ అరేబియా, ఇటలీలో పలు చోట్ల ఇస్లామిక్ సెంటర్లకు నిధులు అందిస్తుందని ఆమె ఆరోపించారు. అది తప్పు.. ఆ విషయంలో కూడా నాకు సదాభిప్రాయం లేదు.. సౌదీ అరేబియాలో పాటిస్తున్న కఠినమైన షరియా చట్టాలను మెలోనీ తప్పుపట్టింది. ఆ దేశ షరియా చట్టాల్లో మతభ్రష్టత్వము, స్వలింగ సంపర్కం లాంటి విధానాలు తీవ్రమైన నేరాలని జార్జియా మెలోనీ తెలిపారు.
ఐపీఎల్ 2024 వేలంకు మహిళా ఆక్షనీర్.. ఇదే మొదటిసారి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకా-కోలా అరేనాలో వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు వేలం ఆరంభం కానుంది. ఇది మినీ వేలం కాబట్టి.. ఒకే రోజులో ముగుస్తుంది. భారత్ అవతల జరుగుతున్న తొలి వేలం కూడా ఇదే కావడం విశేషం. ఐపీఎల్ 2024 వేలంను స్టార్ స్పోర్ట్స్, జియా సినిమాలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మొబైల్ లేదా టీవీలో ఈ వేలాన్ని ఉచితంగా చూడవచ్చు.. ఐపీఎల్ 2024 వేలంను ఓ మహిళా ఆక్షనీర్ నిర్వహించనున్నారు. ఆమె పేరు మల్లికా సాగర్ అద్వానీ. గత కొన్ని సీజన్లకు ఆక్షనీర్‌గా వ్యవహరించిన హ్యూ ఎడ్మీడ్స్ స్ధానాన్ని మల్లికా భర్తీ చేయనున్నారు. తద్వారా ఐపీఎల్‌లో వేలం నిర్వహించనున్న తొలి మహిళా ఆక్షనీర్‌గా మల్లికా నిలవనున్నారు. ఇటీవల ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంకు మల్లికా ఆక్షనీర్‌గా చేశారు. ప్రో కబడ్డీ లీగ్ వంటి ఇతర క్రీడల కోసం జరిగిన వేలంలో ఆమె భాగమయ్యారు. ప్రస్తుతం మల్లికా సాగర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఎవరీ మల్లికా సాగర్ అని క్రికెట్ ఫాన్స్ వెతుకున్నారు.
ఎమోషనల్ సాంగ్ ని రెడీ అయిన దేవర-తంగం
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి వస్తున్న సినిమా దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా వయొలెంట్ గా చేస్తున్నాడు కొరటాల శివ. పక్కా ప్లానింగ్ తో ఎలాంటి లీకులు లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా యాక్షన్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇటీవలే కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ దేవర సినిమా నుంచి సూపర్ సర్ప్రైజ్ రాబోతుందని చెప్పాడు. దీంతో దేవర టీజర్ న్యూ ఇయర్ కి వస్తుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. న్యూ ఇయర్ అకేషన్ మిస్ అయితే సంక్రాంతి పండక్కి మాత్రం దేవర టీజర్ దిగడం గ్యారెంటీ. ఈ టీజర్ రిలీజ్ అయితే దేవర సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయినట్లే. ఇక్కడి నుంచి దేవర దండయాత్రకి రంగం సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే దేవర యాక్షన్ పార్ట్ ని దాదాపు కంప్లీట్ చేసిన కొరటాల శివ, ఇప్పుడు సాంగ్ షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వెయ్యి మందితో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఖోరియోగ్రఫీలో హ్యూజ్ సెటప్ లో ఒక సాంగ్ షూటింగ్ ని చేసారు. లేటెస్ట్ గా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లపైన ఒక ఎమోషనల్ సాంగ్ ని షూట్ చేయనున్నాడు కొరటాల. డిసెంబర్ థర్డ్ వీక్ లో స్టార్ట్ కానున్న షెడ్యూల్ లో ఈ సాంగ్ ని తెరకెక్కిస్తారు. సాంగ్ లో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ లవ్ ట్రాక్ పై ఉంటుందని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ తో సాంగ్ కొత్తగా ఉంటుందని టాక్. అనిరుధ్ హైపిచ్ సాంగ్స్ తో పాటు మెలోడి సాంగ్స్ ని ఇవ్వడంలో కూడా చాలా స్పెషల్. ఈ లవ్ సాంగ్ కి ఎలాంటి ట్యూన్ ఇచ్చాడు అనేది చూడాలి.