శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసి పోతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్ ఏర్పాడింది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపి వేస్తున్నారు.
కడప విమానానికి ఫుల్ ఆక్యుపెన్సీ ఉందంటే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. విశాఖలో భూముల దోపిడీ కోసం వాళ్ళంతా ఇక్కడకు వస్తున్నట్టు కనిపిస్తోంది అని ఆమె విమర్శలు గుప్పించారు. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వంపై అబండాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఎప్పుడు సమర్పించారో ప్రజలకు చెప్పాలి అని పురంధేశ్వరి ప్రశ్నించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో జడ్జిలపై ట్రోలింగ్ చేయటంపై క్రిమినల్ కంటెంప్ట్ కింద దాఖలైన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలోనే ప్రతివాదులు 26 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే ఎన్నికల్లో రోజాకు టిక్కెట్టు రాదని కోంత ది శునకానందంతో చేస్తూన్న ప్రచారం మాత్రమే అని మంత్రి రోజా తెలిపారు. గడప గడపకు మొదలుకోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముందు వరుసలో నేనే ఉంటున్నాను అన్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకూండా పోటి చేస్తాను.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కే సీట్లు లేకుండా రోండేసీ నియోజకవర్గాలలో సర్వే చెయ్యించుకుంటున్నారు.
దరాబాద్ లోని పలు పబ్స్, క్లబ్స్ పై ఇప్పటికే పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ వినియోగం పబ్స్ లోనే అత్యధికంగా ఉంది.. ఈ డ్రగ్స్ అమ్మకాలకు అడ్డాలుగా మారిన పబ్స్ లో బడా బాబుల పిల్లలే టార్గెట్ గా పోలీసులు దృష్టి సారించారు. గోవా, బెంగళూర్, ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ను పెడ్లెర్స్ దిగుమతి చేస్తున్నారు.
హైదరాబాద్ లో డ్రగ్స్ నిర్మూలనపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటికే వరుస దాడులు కొనసాగుతుండటంతో పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, టీఎస్ఎన్ఏబీ, ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. 24 గంటల్లో నాలుగు డ్రగ్స్ గ్యాంగ్స్ ను అరెస్ట్ చేశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉచిత ఇసుక విధానం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. దీంట్లో భాగంగా ఈ పిటిషన్ సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో రిప్లై వాదనలు వినిపించారు.
ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుసగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేతో ఆయన భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్ కు గురి అవుతున్నారు.
తిరుమలలో ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఈ సందర్భంగా నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవలు రద్దు చేసిన టీటీడీ తెలిపింది. ఇక, తిరుమలలో ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 1వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి.