జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రాన ప్రతిష్ట కార్యక్రమానికి తాను వెళ్లి తీరుతానని టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ వెల్లడించారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకొకున్నా.. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఇప్పటికే సన్నాహాలు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆలయంలో కొలువుదీరే బాలరాముడికి ఆఫ్గనిస్థాన్తో సహా ప్రపంచం నలుమూలల నుంచి కానుకలు భారీగా వస్తున్నాయి.
షేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారత్ కు చెందిన నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్ రిపబ్లిక్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది.
న్యూఢిల్లీలోని బాబర్ రోడ్డు పేరు మార్చాలని హిందూ సేన డిమాండ్ చేస్తోంది. బాబర్ రోడ్ సైన్ బోర్డుపై హిందూ సేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబర్ రోడ్ సైన్ బోర్డుపై 'అయోధ్య మార్గ్' అనే స్టిక్కర్ అంటించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం నాడు వెళ్లారు. కాగా, నేడు తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథ స్వామి ఆయలంలో ఆయన పూజలు చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రధాని రామేశ్వరం చేరుకోనున్నారు.
పాకిస్థాన్లో ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా చూసేందుకు పాక్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కకర్ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించడంతో పార్టీ వైఖరి నచ్చక సీనియర్ ఎమ్మెల్యే సీజే చావ్దా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగబోతుంది. ఈ మెగా ఈవెంట్ కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రవేశ పాస్లను జారీ చేసింది. ఎంట్రీ పాస్లో క్యూఆర్ కోడ్ ఉంది.
చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో సీఎం స్టాలిన్ నడుచుకుంటు వెళ్తున్న సమయంలో కాలు స్లిప్ కావడంతో పక్కనే ఉన్న ప్రధాని మోడీ ఆయన ఎడమ చేతి పట్టుకుని ముందుకు నడిపించాడు.