బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులు ఈ నెల 21వ తేదీ లోపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి పొడిగింపు కోసం వాళ్లు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
జపాన్‌కు చెందిన మూన్ మిషన్ స్నిపర్ ఈరోజు చంద్రుడి ఉపరితలంపై దిగబోతోంది. ఈరోజు రాత్రి 9 గంటలకు చంద్రుడి ఉపరితలంపై స్నిపర్ ల్యాండ్ కానుందని జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా తెలిపింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేసింది. అయితే, పోలీసులు భారత్ జోడో న్యాయ్ యాత్ర రూట్ మ్యాప్ పై ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు.
చిరకాల మిత్రదేశాలైన ఇజ్రాయెల్- అమెరికా మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. హమాస్ నియంత్రణలోని గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడానికి ఇదే సరైన సమయమంటూ చేసిన అమెరికా చేసిన సూచనను ఇజ్రాయెల్ తిరస్కరించింది.
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి.. భారతదేశం మొత్తం ఆ శ్రీరాముడి నామంతో మునిగిపోయింది. ఒక జర్మన్ గాయకురాలు రాముడికి సంబందించి అందమైన పాటను తనదైన శైలిలో పాడింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
గత రెండు రోజులుగా పాకిస్తాన్- ఇరాన్ పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చైనా ప్రతిపాదించింది. ఇరు దేశాలు సంయమనం పాటించడంతో పాటు వివాదాలకు దూరంగా ఉండాలని డ్రాగన్ కంట్రీ కోరింది. ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ గురువారం తెల్లవారుజామున దాడులు చేసి తొమ్మిది మందిని చంపింది.. ఇక, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో సున్నీ బలూచ్ తీవ్రవాద గ్రూపు జైష్-అల్-అద్ల్ యొక్క రెండు […]
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి మూడు రాష్ట్రాల్లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.