ఇవాళ అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఉండడంతో నిన్న (ఆదివారం) ఐస్ క్రీమ్ పుల్లలను ఉపయోగించి నమూనా రామ మందిరాన్ని సూక్ష్మ కళాకారుడు సున్నపు అశోక్ తయారు చేశాడు.. రోజుకు గంట చొప్పునా 20 రోజుల పాటు శ్రమించి మినీ రామ మందిరాన్ని నమూనాను తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు.
రామ భక్తులు ఈ ప్రాణ ప్రతిష్ట దివ్య కార్యక్రమాన్ని పురస్కరించుకుని పవిత్రమైన నీలకంఠ పక్షిని చూసేందుకు వెళ్తున్నారు. ఆగ్రాలో పెద్ద సంఖ్యలో రామ భక్తులు చంబల్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీకి క్యూ కట్టారు.
ఇవాళ అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పోలీసు కమిషనర్లు (సీఎస్పీ), పోలీసు సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు.
అయోధ్య నగరమంతటా పోలీసులు పటిష్టమైన పహారా ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ట వేదిక దగ్గర, మందిరం చుట్టూ, మందిరానికి వంద మీటర్ల దూరంలో నలువైపులా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. అలాగే, ఆలయం చుట్టూ కృత్రిమ మేథ(ఏఐ) ఆధారిత సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు.
అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇవాళ అవుట్ పేషెంట్ విభాగాన్ని మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసి ఉంచాలంటూ గత శనివారం ఢిల్లీ ఎయిమ్స్ జారీ చేసిన మెమోరాండంను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. దీనిపై బీజేపీ అధిష్టానందే తుది నిర్ణయం అని ఆమె చెప్పుకొచ్చారు. రేపు అయోధ్యలో శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సెలవు ప్రకటించక పోవడం శోచనీయం అని అన్నారు
పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కామెంట్స్ పై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. తడిచిన ధాన్యం ఎక్కడ ఉందో చెబితే కొంటామని అన్నారు. వెంటనే ఆర్డీవోను పిలిచి కొనుగోలు చేయిస్తాను.. సారథి నిన్నటి వరకు మాతోనే ఉన్నాడు.. ఇప్పటికి ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు.. ఇంకా టీడీపీ కండువా కప్పుకోలేదు.
ఎన్టీవీతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జగన్ వైఎస్ ఫోటోను ఎలా వాడుకున్నారు.. ఇపుడు ఆ ఫోటో ఎక్కడ ఉందో ప్రజలకు తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ హయాంలో పాలన ఇప్పటి పాలనను ప్రజలు బేరీజు వేస్తున్నారు.
పెత్తందార్లు అంటూ ఎమ్మెల్యే ఎలిజా చేసిన వ్యాఖ్యలపై ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ స్పందించారు. మంత్రిగా పని చేసిన కోటగిరి విద్యాధర రావు పెత్తందారీ అయితే ఆయన్ని ఐదుసార్లు ప్రజలు గెలిపించేవాళ్ళు కాదు అని ఆయన వ్యాఖ్యనించారు. నేను పెత్తందారి అయితే లక్షన్నర మెజారిటీతో ఎంపీగా గెలిచేవాడిని కాదు.. తెలంగాణ ఎన్నికల తర్వత సీఎం వైఎస్ జగన్ పార్టీలో కొన్ని మార్పులు చేపట్టారు అని ఎంపీ పేర్కొన్నారు.