మల్లాది విష్ణు వర్గం కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ పాదయాత్ర కార్యక్రమానికి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెల 25న తన వర్గంతో మల్లాది విష్ణు సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో ఏం చేయాలనే దానిపై విష్ణు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు పార్ట కేడర్ చెబుతుంది.
అయోధ్యలో రేపు మహత్తర ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. బాలరాముని ప్రాణప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తుంది.. ఈ కార్యక్రమం కోసం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 10. 20 గంటలకు అయోధ్య ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి 10. 55 నిమిషాలకు రామజన్మభూమి స్థలికి చేరుకుంటారు.
నేడు మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిటీలతో పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచార విధివిధానాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
తిరుమలలో రద్దీ భారీగా తగ్గింది. ఇవాళ ఆదివారం అయినా రద్దీ పెద్దగా కనిపించడం లేదు.. అయితే, సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో పాటు పరీక్షలు కూడా దగ్గరపడుతుండటంతో భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు పేర్కొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ విషాదకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమ జంట ప్రాణం తీసుకుంది. నదిలో పడి ఒకరు, రైలు కింద పడి మరొకరు మృతి చెందారు. అయితే, కొమరాడ మండల కేంద్రానికి చెందిన పద్మజ తోటపల్లి బ్యారేజిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. పార్వతీపురం మండలం చినమరికి గ్రామానికి చెందిన వానపల్లి శ్రావణ్ కుమార్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రాన ప్రతిష్ట కార్యక్రమానికి తాను వెళ్లి తీరుతానని టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ వెల్లడించారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకొకున్నా.. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఇప్పటికే సన్నాహాలు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆలయంలో కొలువుదీరే బాలరాముడికి ఆఫ్గనిస్థాన్‌తో సహా ప్రపంచం నలుమూలల నుంచి కానుకలు భారీగా వస్తున్నాయి.