Gyanvapi mosque: జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు నేటి ఉదయం సంచలన తీర్పు వెల్లడించింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని వ్యాస్ కా తేకానాలో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది. కాగా, వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ(ఏఐఎంసీ) పిటిషన్‌ను జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం కొట్టివేసింది. నాలుగు రోజుల పాటు పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 15న రిజర్వ్ చేసింది.
Read Also: Kolusu Parthasarathy: నేడు టీడీపీ కండువా కప్పుకోనున్న వైసీపీ ఎమ్మెల్యే
అయితే, మసీదు సెల్లార్‌లో హిందువులు పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్ విచారించేందుకు నిరాకరించడంతో హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. ఇక, ఈ తీర్పుపై అడ్వకేట్ ప్రభాస్ పాండే మాట్లాడుతూ.. తీర్పు ప్రకారం తేఖానా రిసీవర్‌గా వారణాసి జిల్లా కలెక్టర్ కొనసాగుతారని వెల్లడించారు.