Electoral Bonds: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఇవాళ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పథకాన్ని ఒక కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. అమెరికాలోని మసాచుసెట్స్ నుంచి పీటీఐతో మాట్లాడిన సేన్.. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో మరింత పారదర్శకతను తీసుకురానున్నట్టు చెప్పారు.
Read Also: KA Paul: పవన్‌కి ఇదే నా ఓపెన్ ఆఫర్.. ఎంత డబ్బు కావాలి..? మా పార్టీలో చేరితే సీఎంని చేస్తా..!
కాగా, ఎలక్టోరల్ బాండ్లు ఒక కుంభకోణం.. దానిని రద్దు చేసినందుకు నేను సంతోషిస్తున్నాను అని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంలో ప్రజలు ఒకరికొకరు ఇచ్చే మద్దతులో మరింత పారదర్శకత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.. రాజకీయ పార్టీలకు ఆర్థిక సహాయం చేయడానికి ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.. కొందరు రహస్యంగా ఈ బాండ్లు ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురైతాయని పేర్కొన్నారు.
Read Also: Drugs Case: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టివేత..
భారతదేశంలోని ఎన్నికల వ్యవస్థ పార్టీ రాజకీయాల స్వభావంతో లోతుగా ప్రభావితమైంది అని ఆర్థికవేత్త అమర్త్యసేన్ తెలిపారు. ఇది ఎన్నికలలో పాల్గొనాలని సాధారణ ప్రజలు వినడానికి చాలా కష్టతరం చేస్తుంది.. దీని వల్ల దేశ ఎన్నికల వ్యవస్థ ప్రభావితమవుతుందని ఆయన చెప్పారు. ప్రత్యర్థి పార్టీల పట్ల ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఈ సమస్య ప్రభావం చూపుతుంది. పౌరుల భావవ్యక్తీకరణ, స్వేచ్ఛతో పాటు వీలైనంత స్వతంత్ర ఎన్నికల వ్యవస్థను మేము కోరుకుంటున్నాము అని ఆయన తెలిపారు.
Read Also: Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడం అని పేర్కొంది. రాజకీయ విరాళాల్లో పారదర్శకత తీసుకురావడం.. నల్లధనాన్ని అరికట్టడమే ఈ పథకం లక్ష్యమన్న కేంద్రం వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ పథకాన్ని వెంటనే మూసివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరణాత్మక వివరాలను సమర్పించాలి అని తెలిపింది. 2019 ఏప్రిల్ 12 నుంచి మార్చి 6 2024 వరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.