PM Modi: నేటి నుంచి రెండ్రోజుల పాటు ప్రధాని మోడీ కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు, రేపు (మంగళ, బుధవారం) కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో పర్యటించనున్నారు. నేటి ఉదయం 10:45 గంటలకు, కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్నారు. స్పేస్ సెంటర్‌ను సందర్శించిన సందర్భంగా మూడు ముఖ్యమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఇక, దేశంలోని అంతరిక్ష రంగాన్ని దాని పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి, ఈ రంగంలో సాంకేతిక, పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోడీ పాటు పడుతున్నారు.
Read Also: Mahesh Babu : ఆ థియేటర్ ను AMBగా మార్చేస్తున్న మహేష్ బాబు..
Also Read
తిరువనంతపురం నుంచి ఇవాళ సాయంత్రం 5:15 గంటలకు తమిళనాడులోని మధురైలో ‘క్రియేటింగ్ ది ఫ్యూచర్.. డిజిటల్ మొబిలిటీ ఫర్ ఆటోమోటివ్ MSME ఎంటర్‌ప్రెన్యూర్స్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక, రేపు (ఫిబ్రవరి 28న) ఉదయం 9:45 గంటలకు, తమిళనాడులోని తూత్తుకుడిలో దాదాపు రూ. 17,300 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
అలాగే, రేపు సాయంత్రం 4:30 గంటలకు, ప్రధానమంత్రి మహారాష్ట్రలోని యవత్మాల్‌లో బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు.. అక్కడ రూ. 4,900 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేయనున్నారు. ఇక, ఈ పథకం కింద మహారాష్ట్రలోని ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు సంవత్సరానికి రూ. 6000 అదనంగా పొందుతారు. దీంతో పాటు మహారాష్ట్రలోని 5.50 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) రూ. 825 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను కూడా ప్రధాని పంపిణీ చేయనున్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద భారత ప్రభుత్వం అందించిన రివాల్వింగ్ ఫండ్‌కు ఈ మొత్తం అదనం అని చెప్పొచ్చు.
Read Also: Kishan Reddy : ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మోడీ వైపు చూస్తున్నారు..
అయితే, గ్రామీణ స్థాయిలో మహిళల నేతృత్వంలోని సూక్ష్మ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా పేద కుటుంబాల వార్షిక ఆదాయాన్ని పెంచడానికి ఈ రివాల్వింగ్ ఫండ్ అందించబడుతుంది. మహారాష్ట్రలో కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీని కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో ఓబీసీ కేటగిరీ లబ్ధిదారుల కోసం ప్రధాని మోడీ ఆవాస్ యోజనను స్టార్ట్ చేయనున్నారు. ఈ పథకం కింద మొదటి విడతగా రూ.375 కోట్లను 2.50 లక్షల మంది లబ్ధిదారులకు బదిలీ చేయనున్నారు. ఇది మాత్రమే కాదు.. మహారాష్ట్రలో రూ. 1,300 కోట్లకు పైగా విలువైన పలు రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
- Tags
- bjp
- Kerala
- Maharashtra
- PM Modi
- TamilNadu
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!