KCR: తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన మహబూబాబాద్, ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ లో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ లో మాలోతు కవితలకు మరోసారి పోటీకి అవకాశం ఇవ్వాలని ఏకగ్రీవంగా నేతలు తీర్మానించారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జ్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిలను కేసీఆర్ నియమించారు.
Read Also: KCR: ఇద్దరు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్..
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుందని నేతలకు తెలిపారు. జిల్లాలో పార్టీ ఓడిపోయినా నేతలు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి.. పార్టీ వీడిచి వెళ్లే నేతలతో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు అని పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయకర్తలను నియమిస్తాము.. ఎన్టీఆర్ లాంటి నేతకు రాజకీయాల్లో ఒడిదుదుకులు తప్పలేదు.. మనమెంత మనకు ఒడిదుడుకులు వస్తాయి.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.. తిరిగి మళ్లీ పుంజుకుంది అని ఆయన చెప్పుకొచ్చారు. మనం ప్రజలకు చేయాల్సింది చేశాము.. అయినా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు.. ప్రజలకు మన విలువ తెలుస్తుంది అని కేసీఆర్ పేర్కొన్నారు.
Read Also: Top Headlines@5PM: టాప్ న్యూస్
ఇక, కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలయింది అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. దళితబంధు ఎన్నికల కోసం తేలేదు.. ఒక విజన్ కోసం తెచ్చాను.. కాంగ్రెస్ పై వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పని చేస్తే గెలుస్తాం అని చెప్పుకొచ్చారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్షాల రుచి చూపించాలి అని కేసీఆర్ వెల్లడించారు.