నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపలు, గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ ఎంక్వైరీ వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. స్కీంలు మొదలయినప్పటి నుంచి జరిగిన లావేదేవీలపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ ప్రాథమిక నివేదికను ఏసీబీ అధికారులకి అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Read Also: Karnataka: ప్రభుత్వ పెద్దలకు బాంబు బెదిరింపులు.. పోలీసుల అప్రమత్తం
ఇక, పశుసంవర్ధక శాఖలో అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దళారులతో పాటు ఉన్నతాధికారుల పాత్ర ఉందని తెలవడంతో ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారు. దీంతో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశాడు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైల్స్ మాయంలో ఇప్పటికే మాజీ మంత్రి ఓఎస్డీ పాత్ర ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. 2018 నుంచి అవకతవలు గుర్తించిన ప్రభుత్వం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆరా తీస్తున్నారు. ఇందులో ఎవరి ఒత్తిడి ఉన్నది? ఎవరి పాత్ర ఉన్నది అనే దానిపై ఎంక్వైరీ చేశారు. సమగ్ర దర్యాప్తుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.