ఇంగ్లీష్ ఆటగాళ్లు సిరీస్ ఓటమిని సైతం మరిచిపోయి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి వాతావరణం వారికి బాగా నచ్చినట్లుంది. హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh ) శీతల రాజధాని అయిన ధర్మశాల ఇంగ్లండ్ పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంటుంది.
దక్షిణ కాశీగా పేర్గాంచిన రాజమండ్రి పవిత్ర గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి అయోధ్య బాల రాముని దర్శనానికి బైక్స్ పై బయల్దేరుతున్న యువకులిద్దర్నీ ఎంపీ మార్గాని భరత్ అభినందించారు. వారి ప్రయాణం దిగ్విజయంగా కొనసాగాలని కోరారు..
25శాతం ఉన్న కాపు కులస్తులకు కూడా టీడీపీ- జనసేన కూటమి వారి ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలతో సమానంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తూ కాపు డిక్లరేషన్ని కూడా ప్రకటించాలని హరిరామయ్య జోగయ్య డిమాండ్ చేశారు.
టాటా ఐపీఎల్ 2024 సీజన్ అందించే క్రికెట్ విందును ఆస్వాదించేందుకు అభిమానులు సిద్ధమవుతున్న నేపథ్యంలో జియో సినిమా దీన్ని మరో ఉత్తేజకరమైన ఎడిషన్‌గా మార్చేందుకు తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో రెండు సినిమాలు ఉండగా మొదటి దానిలో ఎంఎస్ ధోని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూడు వాణిజ్య ప్రచార చిత్రాలు టాటా ఐపీఎల్‌ను డిజిటల్లో వీక్షించ వచ్చు. గత సీజన్లో జియో సినిమాలో రికార్డు స్థాయిలో 449 మిలియన్ల మంది వీక్షించిన టాటా ఐపీఎల్‌తో పాటు […]
రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోబోతున్నాను తెలిపారు. బలిజలంటే జగన్ కు ద్వేషం.. నాకు గతంలో అండదండగా ఉన్న పెద్దిరెడ్డి నాపై చేసిన విమర్శలను పట్టించుకోను.. ఆయనను విమర్శించే స్దాయి నాకు లేదు.. కానీ, నాపై విమర్శలు చేస్తున్న ప్రస్తుత వైసిపీ అభ్యర్ధికి భవిష్యత్తులో సమాదానం చెబుతాను అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు.
ఏపీలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గతేడాది డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారాన్ని వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది.
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు విజయనగరంలోని లైఫ్ లైన్ ఏజెన్సీ టోకరా వేసింది. సుమారు 125 మంది నుంచి 75 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు తెలుస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలింగ్ బూతులపై ప్రధాన ఎన్నికల అధికారికి రెండు లేఖలు రాశారు. పోలింగ్ బూతుల్లో తీసుకోవాల్సిన చర్యలు.. ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామి రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
బెజవాడలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఇక్కడ అభిమానుల ఆనందం చూస్తుంటే అవినాష్ పడిన కష్టం కళ్ళ ముందు కనిపిస్తుంది అని అన్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కుందురు నాగార్జున రెడ్డిని అత్యధిక మెజారిటితో గెలిపించాలి అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు.