TDP-BJP-Janasena Joint Meeting: ఇవాళ ( సోమవారం ) టీడీపీ – బీజేపీ – జనసేన ( TDP-BJP-Janasena ) కూటమికి చెందిన పార్టీల ఉమ్మడి సమావేశం జరగబోతుంది. ఈ మీటింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu ) హాజరుకానున్నారు.. నేటి ఉదయం హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లనున్నారు. ఇక, ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ( Gajendra singh Shekawat )తో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) సమావేశం కానున్నారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై తీవ్ర కసరత్తులు చేసే అవకాశం ఉంది. ఇక, ఇవాళ మూడు పార్టీల అగ్ర నేతల సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం పాల్గొనబోతున్నారు.
Read Also: WPL 2024: ఒక పరుగు తేడాతో బెంగళూరు ఓటమి.. ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్!
అయితే, ఇప్పటికే కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ – పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) మధ్య ఓ సారి సమావేశం అయ్యారు. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన – బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపై ఇరువురు చర్చించారు. పాడేరు, విశాఖ నార్త్, పి. గన్నవరం, కాకినాడ అర్బన్, ఉంగుటూరు, కదిరి, మదనపల్లె, శ్రీకాళహస్తి, కైకలూరు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బీజేపీ ప్రతిపాదనను తీసుకు వచ్చినట్లు సమాచారం. ఇక, ప్రతిపాదిత స్థానాల్లో నుంచి ఆరు స్థానాల్లో బీజేపీ పోటీ చేసే ఛాన్స్ ఉండగా.. ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అభిప్రాయానికి బీజేపీ – జనసేన వచ్చినట్లు టాక్. ఇవాళ చంద్రబాబు ( Chandrababu )తో కూడా జరిగే భేటీలో సీట్ల సర్దుబాటుపై గజేంద్ర సింగ్ షెకావత్ ( Gajendra singh Shekawat), పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. నేడు లేదా రేపు ఈ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.